Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: జనవరి 21, 2023 పంచాగం
తేది : 21, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : చతుర్దశి ఉదయం 06:17ని. అమావాస్య
నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 09:40 ని. ఉత్తరాషాఢ
వర్జ్యం : ఉదయం 9.58 ని॥ నుంచి 11.21ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.41ని నుండి 8.32ని.
రాహుకాలం : ఉదయం 9.00 ని.ల నుంచి 10.30ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 2.00ని.ల నుంచి 3.41ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.53ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.01ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు కొన్ని చేయాల్సిన పనులు నిర్లక్ష్యం చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.
వృషభరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. ఇతరులకు సహాయం చేయటానికి ముందడుగు వేస్తారు.
మిథునరాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు శుభవార్త వింటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో సమయాన్ని వృధా చేస్తారు.

కర్కాటకరాశి: ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎక్కువవుతాయి. దీనివల్ల మనశాంతి కోల్పోతారు. చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి కావు. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సింహరాశి: ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. భూమికి సంబంధించిన విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులకు దూరంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా లేదు. నిరుద్యోగులు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు.
కన్యరాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంటారు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.
తులరాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన ఆలోచించాలి. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. దూరపు బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. ఒక పరిచయం మీ జీవితంలోకి వస్తుంది. కొన్ని పనులు చేసేటప్పుడు ఇతరుల సహాయం అందుకుంటారు. ఈరోజు అనుకూలంగా ఉంది.
వృశ్చికరాశి: ఈ రాశి వారు తోబుట్టువులతో కలిసి ఒక శుభకార్యం లో పాల్గొంటారు. అనవసరంగా వాదనలకు దిగకూడదు. ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వాళ్ళు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఇతరులకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చ చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
మకరరాశి: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. కోల్పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయంలో బాగా తిరగాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.
మీనరాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొన్ని కోర్టు సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సమయాన్ని వృధా చేయకూడదు.