Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: జనవరి 23, 2023 పంచాగం

తేది : 23, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ సాయంత్రం 06:43ని.
నక్షత్రం : శ్రవణం ఉదయం 03:21ని. ధనిష్ఠ
వర్జ్యం : ఉదయం 6.54ని॥ నుంచి 8.20ని॥ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.47ని నుండి 1.38ని. తిరిగి 3.20ని. నుండి 4.11ని.
రాహుకాలం : ఉదయం 7. 30 ని.ల నుంచి 9.00ని.ల వరకు
యమగండం : ఉదయం 10.38ని.ల నుంచి 12.19ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.53ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.02ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రక్తసంబంధీకులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభ రాశి: ఈ రాశి వారు చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల పై అధికారుల నుండి విమర్శలు వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ బంధువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

మిధున రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. గతంలో కోల్పోయిన వస్తువులు తిరిగి అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. సమయాన్ని కాపాడుకోవాలి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొందరి విషయాల గురించి అసలు పట్టించుకోకూడదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహరాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులకు చదువు పట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని రోజుల నుండి బాధపడుతున్న అనారోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది. తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాలి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కన్య రాశి: ఈ రాశి వారు అనుకోకుండా కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. ఏ పని చేసినా కాస్త ఆలోచించడం మంచిది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. సమయం అనుకూలంగా ఉంది.

తుల రాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా లాభాలు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఏ పని చేసిన నిర్లక్ష్యం చేయకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరరాశి: ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని విషయాల వల్ల మనశ్శాంతి కోల్పోతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీరు పని చేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కుంభరాశి: ఈ రాశి వారు అనుకోకుండా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ సంపాదించే స్తోమత ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. బయట విషయాలలో తల దూర్చకూడదు.

మీన రాశి: ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. అనారోగ్య సమస్య నుండి ఈరోజు బయటపడతారు. ఇతరుల గురించి అనవసరంగా చర్చలు చేయకూడదు. పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on జనవరి 23, 2023 at 12:00 ఉద.