Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: జనవరి 24, 2023 పంచాగం

తేది : 24, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ మధ్యాహ్నం 03:22ని.
నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 12:26 ని. శతభిషం రాత్రి 09:58ని.
వర్జ్యం : మధ్యాహ్నం 3.52ని॥ నుంచి 5.20ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి 11.15ని. నుండి 12.00ని.
రాహుకాలం : మధ్యాహ్నం 3.00ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.53ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.02ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. విలువైన వస్తువులు కాపాడుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి నిర్లక్ష్యం చేస్తారు.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుండి బాధపడుతున్న అనారోగ్య సమస్య ఈరోజు కోలుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

మిధున రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలు పట్ల బాగా నిర్లక్ష్యం చేస్తారు. ఇతరులతో గొడవ పడడానికి ముందుంటారు. కొన్ని చెడు అలవాట్లు అనారోగ్య సమస్యను తెచ్చి పెడతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి. పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తారు. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. వ్యాపారస్తులు ఈరోజు పెట్టుబడి విషయంలో తొందర పడాల్సి ఉంటుంది.

సింహరాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు పట్ల మంచి ఫలితాలు అందుకుంటారు. గత కొన్ని రోజుల నుండి నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్లకు ఈరోజు శుభవార్త వినాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తుల రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా పొదుపు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహన కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. ఈరోజు వ్యాపారాలు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు పని చేసే చోట ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరులు మీకు సహాయం చేస్తారు. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. పిల్లల గురించి బాగా ఆలోచించాలి. సమయాన్ని కాపాడుకోవాలి.

మకర రాశి: ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

కుంభ రాశి: ఈ రాశి వారు ఏ పని చేసినా నిర్లక్ష్యం చేయకూడదు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి. కొన్ని ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సమయాన్ని కాపాడుకోవాలి.

మీన రాశి: ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూరపు బంధువులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. శత్రువుల భారీ నుండి బయటపడతారు. కోర్టు సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on జనవరి 24, 2023 at 12:00 ఉద.