Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: జనవరి 26, 2023 పంచాగం

తేది : 26, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి ఉదయం 10.28ని.
నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 6.56ని. ధనిష్ఠ
వర్జ్యం : ఉదయం 6.46ని॥ నుంచి 8.21ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని నుండి 11.05ని. తిరిగి 3.21ని. నుండి 4.12ని.
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 ని.ల నుంచి 3.00ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.53ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.04ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు భవిష్యత్తు కోసం బాగా ఆలోచిస్తారు. రోజువారి పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మరింత బాధపెడతాయి. సమయాన్ని కాపాడుకోవాలి.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల కోసం ఖర్చులు తగ్గించడం మంచిది. బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం చక్కగా మలుపు తిరుగుతుంది. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా పూర్తవుతాయి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారికి గతంలో వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. శత్రువులకు మాత్రం దూరంగా ఉండాలి. మీ గౌరవాన్ని భంగం కలిగించే వారితో అస్సలు ఉండకూడదు. కొందరు మీ మనసును పాడు చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీ మనశ్శాంతి కోల్పోతారు.

సింహరాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. దూర ప్రాణాలు చేయటం వల్ల పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు. మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశి వారు ఏ పని చేసినా అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే పూర్తవుతాయి. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి.

తుల రాశి: ఈ రాశి వారికి తమ తల్లిదండ్రుల సహాయం అందుతుంది. మీ ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. దూరప్రాంతాల బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన సక్రమంగా పూర్తవుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు. మీ పెద్దవారి మాటలు విని కొన్ని వస్తువులు కొనుగోలు చేయటం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఇతరులతో సన్నిహితం ఉండకూడదు. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్య నుండి బయటపడటం వల్ల సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

మకరరాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించే వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంది. అనారోగ్య సమస్య ఎక్కువ అవుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

కుంభరాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. ఇతరులకు సహాయం చేయటానికి నిరాకరిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

మీన రాశి: ఈ రాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందుఅనుభవమున్న వ్యక్తుల సలహాలు అందుకోవాలి. తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సమయాన్ని అనుకూలంగా ఉంచుకోవాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on జనవరి 26, 2023 at 12:00 ఉద.