Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: జనవరి 28, 2023 పంచాగం
తేది : 28, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి ఉదయం 08:43ని.
నక్షత్రం : అశ్విని రాత్రి 07:06ని.
వర్జ్యం : ఉదయం 5.12ని॥ నుంచి 6.53ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.41ని నుండి 8.32ని.
రాహుకాలం : ఉదయం 9.00 ని.ల నుంచి 10.30ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 2.00ని.ల నుంచి 3.41ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.52ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.05ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయాన్ని గడుపుతారు. కొన్ని పనులు నిర్లక్ష్యం చేస్తారు. ఇతరులకు అద్భుతమైన సలహాలు అందిస్తారు. ఇతరులు మిమ్మల్ని బాగా విమర్శలు చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో చాలా బాధపడాల్సి ఉంటుంది. మీ నిర్ణయాలు అస్సలు మార్చుకోవద్దు.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇతరులు డబ్బు సహాయం కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది. బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. కొన్ని ప్రయాణాలు మీకు సంతోషాన్ని అందిస్తాయి.
మిధున రాశి: ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాహనాలు కొనుగోలు చేసేవాళ్లు తల్లిదండ్రుల నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. పిల్లల ఆరోగ్యం అనుకూలంగా ఉండదు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఒక శుభవార్త వింటారు. నూతన గృహ ప్రవేశాలు చేస్తారు. బంధువులతో సమయాన్ని గడుపుతారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని విమర్శలు చేస్తూ ఉంటారు. కొందరి మాటలను అస్సలు పట్టించుకోకూడదు. పనులు సక్రమంగా పూర్తి కావు.
సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తల్లిదండ్రులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. దీనివల్ల బాధపడాల్సి ఉంటుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.
కన్య రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా పొదుపు చేయటం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. పాత స్నేహితులను కలవడం వల్ల సమయాన్ని కాలక్షేపం చేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం వల్ల భవిష్యత్తులో పూర్తి చేస్తారు.
తుల రాశి: ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు భవిష్యత్తులో సమస్యలు తీరే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి. సమయాన్ని కాపాడుకోవాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుకోకుండా మీ బంధువులను కలుస్తారు. శత్రువులు మిత్రులు అవ్వటం వల్ల సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశముంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ మంచి జరుగుతుంది. గత కొన్ని రోజుల నుండి బాధపడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకరరాశి: ఈ రాశి వారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు. పెద్ద వాహనాలలో ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల తాము చేసే పనులను నిర్లక్ష్యం చేసుకుంటారు.
కుంభరాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు పట్ల బాగా నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేసే వాళ్లకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యతో బాధపడే వాళ్ళు మనశ్శాంతి కోల్పోతారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్లకు సలహాలు అందుతాయి.
మీన రాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తల్లిదండ్రుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.