Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: జనవరి 31, 2023 పంచాగం
తేది : 31, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి 11:54 am
నక్షత్రం : రోహిణి పూర్తి
వర్జ్యం : ఉదయం 6.53ని॥ నుంచి 8.40ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి 11.15ని. నుండి 12.00ని.
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.52ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.06ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు పనులను సక్రమంగా పూర్తి చేసుకోలేరు. కొన్ని విషయాల పట్ల అసలు దృష్టి పెట్టలేక పోతారు. ఇతరులను అగౌరవపరుస్తారు. అయిన వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సహాయం కోసం చూసేవాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఇతరులను అసలు లెక్క చేయరు. అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. పాత మిత్రులను కలిసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల బంధువుల నుండి కొన్ని సలహాలు అందుకుంటారు.
మిధున రాశి: ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపించరు. పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని మరింత బాధపెడుతుంది. కొన్ని అవసరాలకు ఇతరుల సహాయం అందుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని వృధా చేయకూడదు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేసే వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
సింహరాశి: ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపడకూడదు. విపరీతమైన ఖర్చులు పెరగడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు. ఇతరులకు సహాయం చేయడానికి నిరాకరించరు.
కన్య రాశి: ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు తొందరపడకూడదు. అనుకోకుండా బంధువులు రాకతో సంతోషంగా ఉంటారు. సమయాన్ని కాపాడుకుంటారు.
తుల రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. ఒంటరి ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇతరులు మీకు అనవసరమైన ఖర్చులు పెట్టిస్తారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. వ్యాపారస్తులు ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు సంతోషకరంగా ఉంటారు. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మకరరాశి: ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు కొన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి.
కుంభరాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపించాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
మీన రాశి: ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. తిరిగి సంపాదించే స్తోమత కూడా ఎక్కువగా ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. పిల్లలనుండి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతోకొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.