Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs july 14, 2022 పంచాగం
తేది : 14, జులై 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాడ మాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : గురు వారం
పక్షం : కృష్ణ పక్షం
తిథి : పౌర్ణమి మధ్యాహ్నం 12.07ని.ల పాడ్యమి 8.16ని. ల
నక్షత్రం : ఉత్తరషాఢ ఉదయం 8.18ని.ల
వర్జ్యం : ఉదయం 11.50 ని॥ నుంచి మధ్యాహ్నం
1.15ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని.ల నుంచి 11.05 మధ్యాహ్నం 3.21ని.ల నుండి 4.12వరకు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 ని.ల నుంచి 3.00 ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి ఉదయం 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:51 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:50ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఖర్చులు చేస్తారు. అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇతరులతో వాదనలకు దిగకండి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
వృషభరాశి: ఈరాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆరోగ్యంపట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. శత్రువులకు దూరంగా ఉండాలి. కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
మిథునరాశి: ఈరాశి వారు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కర్కాటకరాశి: ఈ రాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు. కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది. అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
సింహరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.
కన్యరాశి: ఈరాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానం గురించి ఆలోచనలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.
తులరాశి: ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. తోబుట్టువులతో వాదనలకు దిగకండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించండి.
వృశ్చికరాశి: ఈ రాశి వారు ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడే ముందు ఎక్కువగా ఆలోచించాలి.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.
మకరరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం సమయంలో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
మీనరాశి: ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తవుతుంది. అంతేకాకుండా కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అనవసరమైన విషయాలను పట్టించుకోకూడదు.