Zodiac Signs : ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac-signs-july 2-2022-పంచాగం
తేది : 2, జులై 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాడ మాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : తదియ 3.17ని.ల వరకు
నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 3.56ని.ల
వర్జ్యం : ఉదయం 6.06ని॥ నుంచి 7.52 ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.41ని.ల నుంచి ఉదయం 8.32ని.లవరకు
రాహుకాలం : ఉదయం 9.00 ని.ల నుంచి 10: 30 ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 2.00ని.ల నుంచి 3.41ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:49ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:50 ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంది. మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
వృషభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నందున ఇతరులకు సహాయం చేస్తారు. దీని వల్ల మీ వ్యక్తిత్వం గురించి మంచిగా మాట్లాడుతారు. కొన్ని కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు.
మిథునరాశి: ఈ రాశి వారు ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తారు. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దీనివల్ల అవసరం ఉన్నప్పుడు సమయానికి ధనం దొరకదు. కొన్ని విషయాల పట్ల ముందుగా నిర్ణయం తీసుకోవాలి.
కర్కాటకరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా పొదుపు చేయాలి. దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల పట్ల నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఇతరులు మీకు ఇచ్చే సొమ్మును కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.
కన్యరాశి: ఈ రాశి వారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈరోజంతా కొన్ని సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తులరాశి: ఈ రాశి వారికి ఆర్థికపరంగా సమస్యలు ఎదురవుతాయి. మీ పాత స్నేహితుల నుండి ధనసహాయం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
వృశ్చికరాశి: ఈ రాశి వారు మీ పెద్దల నుండి ధన సహాయం పొందుతారు. దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది. ఇతరులకు ఇచ్చే అప్పును తీరుస్తారు. అనుకోకుండా ఇంటికి అతిథులు వస్తారు. ఉద్యోగస్తులు పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మకరరాశి: ఈ రాశి వారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం వల్ల ఖర్చులు అదుపులో ఉంచుతారు. పెద్దల పట్ల మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది. దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు. కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీనరాశి: ఈరాశి వారు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల ఇతరుల నుండి సహాయం అందుతుంది. మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.