Zodiac Signs :ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Signs June 13 2022 పంచాగం
తేది : 13, జూన్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : త్రయోదశి ఉదయం 12.27ని. చతుర్దశి సాయంత్రం 9.03
నక్షత్రం : అనురాధ రాత్రి 9.24ని.
వర్జ్యం : ఉదయం 2.20ని॥ నుంచి
3.46 ని॥ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.47ని.ల నుంచి 1.38ని.లవరకు తిరిగి సాయంత్రం 3.20ని. ల నుంచి 4.11ని. వరకు
రాహుకాలం : ఉదయం 7.30 ని.ల నుంచి 9.00 ని.ల వరకు
యమగండం : ఉదయం 10.38ని.ల నుంచి 12.19ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:45 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:45 ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడానికి సహనం కావాలి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని మరింత బాధ పెట్టేలా ఉంటాయి.
వృషభరాశి: ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎక్కువ లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఈరోజు సంతోషంగా ఉంటారు.
మిధునరాశి: ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవటం మంచిది.
కర్కాటకరాశి: ఈ రాశివారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు. ఏ పని చేసిన ఆలోచించి చేయటం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. సమయం అనుకూలంగా ఉంది.
సింహరాశి: ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటి నుండి బయటపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు చేసేటప్పుడు ఆలోచించడం మంచిది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కన్యారాశి: ఈ రాశి వారు ఈ రోజు చేసే పనులలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మీకు గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
తులారాశి: ఈ రాశి వారికి అందరిని కలుపుకుపోయే గుణం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.
వృశ్చికరాశి: ఈ రాశివారు ఇతరుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. తొందరపడి అనవసరమైన వాదనలకు దిగడపోవడం మంచిది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించడం మంచిది.
మకరరాశి: ఈ రాశివారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. పైగా ఇతరులు వీరి సొమ్మును తిరిగి ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తారు. దూరపు బంధువులను శుభవార్త వింటారు. విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
కుంభరాశి: ఈ రాశివారు తీరికలేని సమయంతో గడుపుతారు. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది.
మీనరాశి: ఈ రాశి వారు చేయాల్సిన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఆలోచించి చేయటం మంచిది. కొన్ని నిర్ణయాలను అనుకూలంగా మార్చుకోవాలి. శత్రులకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.