Zodiac Signs : ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac-signs-june-15-2022- పంచాగం
తేది : 15, జూన్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణ పక్షం
తిథి : పాడ్యమి మధ్యాహ్నం1.32ని.ల
నక్షత్రం : మూల మధ్యాహ్నం 3.33ని.ల
వర్జ్యం : ఉదయం 10.58ని॥ నుంచి మధ్యాహ్నం
1.23 ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని.ల నుంచి ఉదయం 12.48ని.లవరకు
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 ని.ల నుంచి 1: 30 ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి ఉదయం 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:45 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:47 ని.లకు
మేషరాశి: ఈ రాశివారు ఇతరుల ఆకర్షణకు లోనవుతారు. కొన్ని పనులు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో వాదనలకు దిగకండి. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తులను పొందే అవకాశం ఉంది. వాయిదా పడే పనులు పూర్తి చేసుకుంటారు. సంతోషంగా గడుపుతారు.
మిధునరాశి: ఈ రాశి వారు అన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా విదేశీ ప్రయాణం చేసే అదృష్టం వస్తుంది. కుటుంబ అవసరాలను తీర్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క విషయంలో చాలా చురుకుగా ఉంటారు. విద్యార్థులు కష్టపడాలి.
కర్కాటకరాశి: ఈ రాశి వారు చాలా ఆనందంగా ఉంటారు. సమయానికి తగ్గ పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం చాలా మంచిది.
సింహరాశి: ఈ రాశి వారు ఆర్థిక లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకండి. ఉద్యోగస్తులు మంచి విజయాలు సొంతం చేసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
కన్యారాశి: ఈ రాశి వారు పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సమయాన్ని కాపాడుకుంటారు. అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు. మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో ఇతరులకు సలహాలు ఇస్తారు.
తులారాశి: ఈ రాశి వారు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త మిమ్మల్ని బాగా సంతోష పెడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
వృశ్చికరాశి: ఈ రాశివారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశివారు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి. ఇతరుల మాటలను తొందరగా నమ్మకండి.
మకరరాశి: ఈ రాశివారు ప్రతి ఒక్క పనిలో ఉత్సాహం చూపిస్తారు. ఏ ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. కొన్ని ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. ఈరోజు సంతోషంగా ఉంటారు.
కుంభరాశి: ఈ రాశి వారు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుండి బయట పడే మార్గం ఉంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం అందుకుంటారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు.