Zodiac Signs : ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Signs June 04 2022 పంచాగం
తేది : 4, జూన్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : శని వారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : చవితి మధ్యాహ్నం 2.42ని.ల వరకు పంచమి
నక్షత్రం : పుష్యమి రాత్రి 9.55ని.ల వరకు
వర్జ్యం : ఉదయం 12.03 ని॥ నుంచి మధ్యాహ్నం
1.49 ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.41ని.ల నుంచి ఉదయం 8.32ని.లవరకు
పితృ తిథి పాడ్యమి.
రాహుకాలం : ఉదయం 9.00 ని.ల నుంచి 10: 30 ని.ల వరకు
యమగండం : ఉదయం 12.03ని.ల నుంచి 1.49ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:45 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:42 ని.ల వరకు
మేషరాశి: ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఏ విషయంలోనైనా ఆలోచనాత్మకంగా ఉంటారు. కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యక్తిగత విషయాలను పట్టించుకోకండి.
వృషభరాశి: ఈ రోజు చాలా ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ఉద్యోగవకాశాలు ఇస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. సమయంను కాపాడుకుంటారు.
మిధునరాశి: ఈ రోజు చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయంలో కొందరు వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి.
కర్కాటకరాశి: ఈరోజు మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది.
సింహరాశి: ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. భవిష్యత్ గురించి ఆలోచించండి. కొన్ని పనులు చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.
కన్యారాశి: ఈరోజు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
తులారాశి: ఈరోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.
వృశ్చికరాశి: ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఏ పని చేసిన ఆలోచించి చేయటం మంచిది. ఇతరులు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకోకుండా లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి: ఈరోజు తొందరపడి ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యకండి. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేయటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మకరరాశి: ఈరోజు ఏ పని మొదలు పెట్టినా మంచి సక్సెస్ అందుకుంటారు. కొందరి జీవితాల్లో స్థానం పొందే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కుంభరాశి: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషకరం గా ఉంటారు. ఇతరులకు సహాయం చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు .
మీనరాశి: ఈరోజు ఆర్థికంగా పొదుపు చేస్తారు. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఏ పని చేసిన ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.