Zodiac Signs : ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Signs June 09 2022 పంచాగం
తేది : 9,జూన్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్టమాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : గురు వారం
పక్షం : శుక్ల పక్షం
తిథి : నవమి రాత్రి 8.21ని.ల వరకు
నక్షత్రం : ఉత్తర 4.31ని.ల వరకు హస్త
వర్జ్యం : ఉదయం 12.10 ని॥ నుంచి మధ్యాహ్నం
1.42 ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని.ల నుంచి 11.05
3.21ని.ల నుంచి 4.12ని.లవరకు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 ని.ల నుంచి 3.00 ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి ఉదయం 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5:45 ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:45 ని.ల వరకు
మేషరాశి: ఈరోజు మీరు సంపాదించిన దాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. కొన్ని ఒడిదుడుకులు వల్ల మనశ్శాంతి కోల్పోతారు. దైవ దర్శనాలు చేస్తారు. వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూవివాదాలు ఎదురవుతాయి.
వృషభరాశి: ఈరోజు మీ శత్రువులు మిత్రులుగా కూడా మారుతారు. కొన్ని ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కొన్ని పనులు వాయిదా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
మిధునరాశి: మీకు ఈరోజు సమాజంలో మంచి గౌరవం అందుతుంది. కొన్ని కష్టాలకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
కర్కాటకరాశి: ఈరోజు మీరు ఆర్థికంగా నిరాశ చెందుతారు. మీరు చేసే ఆలోచనలు అంతగా అనుకూలంగా ఉండవు. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో పొరపాట్లు ఉంటాయి.
సింహరాశి: ఈరోజు మీకు కొన్ని కుటుంబ సభ్యులు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ దూరపు బంధువుల నుంచి కొన్ని విషయాల గురించి మాట్లాడుతారు. వ్యాపారస్తులకు కొన్ని చిక్కులు ఏర్పడతాయి.
కన్యారాశి: ఈరోజు మీ బంధువులను కలిసే అవకాశం ఉంది. ఆదాయం అనుకూలంగా ఉంది. ఆస్తి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి గా ఫీలవుతారు. పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
తులారాశి: ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్య ఈరోజు తీరుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సమయంను కాపాడుకోవాలి.
వృశ్చికరాశి: ఈరోజు మీరు చేసే పనులలో కొన్ని ఇబ్బందులెదురవుతాయి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు. మీ బంధువులతో వాదనలకు దిగకండి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి: ఈరోజు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తోబుట్టువులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి. వ్యక్తిగత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
మకరరాశి: ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది.
కుంభరాశి: కొన్ని ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. తల్లిదండ్రులతో వాదనకు దిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయాన్ని కాపాడుకోవాలి.
మీనరాశి: ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకండి. శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.