Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మార్చి 12, 2023 పంచాగం
తేది : 12, మార్చి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : ఆది వారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : పంచమి రాత్రి 10.01ని.
నక్షత్రం : స్వాతి ఉదయం 8.00ని.
వర్జ్యం : మధ్యాహ్నం 1.41ని॥ నుంచి 3.18ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని నుండి 5.53ని.
రాహుకాలం : సాయంత్రం 4.30ని.ల నుంచి 6.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.30ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.21ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు మనోబలంతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు శారీరకంగా మీరు విశ్రాంతి తీసుకుంటారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి. దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు. ఇతరులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. సమయాన్ని కాపాడుకుంటారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులు ప్రారంభించినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో చనువుగా ఉండకపోవటమే మంచిది. సమయాన్ని కాపాడుకోవాలి.
మిధున రాశి: ఈ రాశి వారు ఈ రోజు తమ కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. మనసుపెట్టి కొన్ని పనులు పూర్తి చేయటం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు తమ ఆత్మ విశ్వాసమే ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి. ఒక విషయం గురించి చాలా సంతోషంగా ఉంటారు. మీరంటే పడని వాళ్లను దూరంగా ఉంచడం మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకూడదు. ఈరోజు కాస్త అనుకూలంగా ఉంది.
సింహరాశి: ఈ రాశి వారు తమ పనులలో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగడం మంచిది. కొన్ని విషయాల వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొందర్ని ఎక్కువగా నమ్మకూడదు. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త వల్ల సంతోషంగా ఉంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. కొన్ని విషయాలలో మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని పనులలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. మొహమాటాన్ని దూరంగా ఉంచడం మంచిది. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తే మంచిది. కొన్ని పనులల్లో మనో ధైర్యంగా ఉండటం వల్ల సంతోషంగా ఉంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల నుండి శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరరాశి: ఈ రాశి వారికి ఇతరుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. సమయాన్ని కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.
కుంభరాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేయడం మంచిది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాలలో ఒత్తిడి చెందుతారు.
మీన రాశి: ఈ రాశి వారు కొన్ని పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. మీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టకపోవడం మంచిది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. సమయాన్ని కాపాడుకోవాలి.