Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: మార్చి 15, 2023 పంచాగం

తేది : 15, మార్చి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : అష్టమి సాయంత్రం 06:45 ని.
నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 07:33ని. మూల
వర్జ్యం : మధ్యాహ్నం 3.21ని॥ నుంచి 4.50ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని నుండి 12.48ని. తిరిగి 12.48ని. నుండి 1.39ని.
రాహుకాలం : మధ్యాహ్నం 12.00ని.ల నుంచి 1.30ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.28ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.22ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు తమ పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు. ఈరోజు కొన్ని పనులు గందరగోళంగా ఉంటాయి. వాయిదా పడిన పనులు త్వరగా పూర్తికాకుండా ఉంటాయి. తల్లిదండ్రుల సలహాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.

వృషభ రాశి: ఈ రాశి వారు భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అందుకుంటారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచనలు చేయాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమయాన్ని కాపాడుకోవాలి.

మిధున రాశి: ఈ రాశి వారు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో నుంచి కొందరు వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీనివల్ల కాస్త బాధపడతారు. విలువైన వస్తువులను కాపాడుకోవాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఒక శుభవార్త వింటారు. దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు. రాజకీయాలలో ఉండే వ్యక్తులకు గౌరవం ఎక్కువగా అందుతుంది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు తొందరపడకూడదు.

సింహరాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. శత్రువులు ఇబ్బంది పెట్టడం వల్ల చాలా బాధపడతారు. కొన్ని పనులు చాలా ఒత్తిడిగా ఉంటాయి. పాత స్నేహితులను కలిసి అవకాశం ఉంది. ఒక శుభవార్త వింటారు.

కన్య రాశి: ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు చేసే వాళ్ళు తగ్గించుకోవడం మంచిది. భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు.

తుల రాశి: ఈ రాశి వారు తమ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు. కొన్ని రోజుల నుండి బాధపడుతున్న కోర్టు సమస్యలు ఈరోజు తీరుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. సంపాదన ఎక్కువగా ఉంది. ఒక శుభవార్త వినడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశివారు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండటం మనశ్శాంతి కోల్పోతారు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని విహారయాత్రలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు అంతగా అనుకూలంగా లేదు.

మకరరాశి: ఈ రాశి వారు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. శత్రువులను దూరంగా పెట్టడం మంచిది. కొందరు మీ వ్యక్తిగత విషయాల పట్ల చులకనగా ప్రవర్తిస్తారు.

కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా చాలా లాభాలు అందుకుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొన్ని గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అందుకునే అవకాశం ఉంది.

మీన రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలలో బాగా ఆందోళన చెందుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకండి. కొన్ని ప్రయాణాలు చేయకపోవటం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడం మంచిది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on మార్చి 15, 2023 at 12:00 ఉద.