Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: మార్చి 19, 2023 పంచాగం

తేది : 19, మార్చి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : ద్వాదశి ఉదయం 08:07ని. త్రయోదశి
నక్షత్రం : శ్రవణం ఉదయం 12:29ని. ధనిష్ఠ రాత్రి 10:04ని.
వర్జ్యం : ఉదయం 4.32ని॥ నుంచి 5.59ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని నుండి 5.53ని.
రాహుకాలం : సాయంత్రం 4. 30ని.ల నుంచి 6.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.25ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.23ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా చేయటం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభ రాశి: ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. చేయాల్సిన పనులు సమయానికి పూర్తి చేయడం మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

మిధున రాశి: ఈ రాశి వారు బంధువులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. కొన్ని పనులు పూర్తి చేసేటప్పుడు ఇతరుల సహాయం అందుకుంటారు. విలువైన వస్తువులు కాపాడుకోవాలి. అనారోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండండి. సమయాన్ని కాపాడుకోవాలి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా పూర్తవుతుంది. కొన్ని కోర్టు సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దూరపు బంధువుల నుండి శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.

సింహరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. కొన్ని చేపట్టిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు కొన్ని సలహాలు అందిస్తారు. పిల్లల నుండి శుభవార్త వింటారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కన్య రాశి: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కాపాడుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. జీవిత భాగస్వామి సమయాన్ని గడుపుతారు.

తుల రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇతరుల సహాయం అందుతుంది. కొన్ని పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం అందుకోవడం వల్ల సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల చాలా బాధపడతారు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులు చులకనగా చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. డబ్బులు ఆదా చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు ప్రారంభించేటప్పుడు తొందరపడకూడదు. ఇతరుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

మకరరాశి: ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి. తీరిక లేని సమయంతో గడిపే వాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.

కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పనులు ప్రారంభించే వాళ్ళు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం కష్టపడాల్సి ఉంటుంది.

మీన రాశి: ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. దూరపు ప్రయాణాలు చేయకపోవటం మంచిది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం అందుకుంటారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...