Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మార్చి 20, 2023 పంచాగం
తేది : 20, మార్చి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : త్రయోదశి ఉదయం 4.55ని. చతుర్దశి
నక్షత్రం : శతభిషం రాత్రి 7.39ని.
వర్జ్యం : ఉదయం 1.28ని॥ నుంచి 2.55ని॥ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.47ని నుండి 1.38ని. తిరిగి 3.20ని. నుండి 4.11ని.
రాహుకాలం : ఉదయం 7.30ని.ల నుంచి 9.00ని.ల వరకు
యమగండం : ఉదయం 10.38ని.ల నుంచి 12.19ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.24ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.23ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు చేయాల్సిన పనులలో చాలా కష్టపడాలి. దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. అనుకోకుండా మీ ఇంటికి అతిధులు రాకతో చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు తీరిక లేని సమయంలో గడుపుతారు. ఉద్యోగస్తులు అప్రమత్తంగా. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు సంతోషంగా ఉంటారు.
మిధున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ వ్యక్తిగత విషయాల పట్ల ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి. మీకు రావాల్సిన అప్పు తిరిగి వస్తుంది. కొన్ని విషయాలలో అల్లకల్లోలంగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశి వారు ఆస్తికి సంబంధించిన విషయంలో కాస్త ఒత్తిడి ఎదురుకుంటారు. కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆగిపోయిన పనులు పూర్తి చేసేటప్పుడు ఇతరుల సహాయం అందుకుంటారు.
తుల రాశి: ఈ రాశి వారు తమ వ్యక్తిగతం పట్ల సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు. కొన్ని కోర్టు సమస్యలు తీరిపోతాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. భూమికి సంబంధించిన విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాల గురించి బాగా ఆలోచనలు చేయాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. శత్రువులు మిమ్మల్ని మరింత బలహీనులను చేస్తారు. అనవసరమైన ఖర్చులు చెయ్యకపోవటమే మంచిది. కొన్ని విషయాలలో ఒత్తిడి చెందుతారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి. నూతన గృహప్రవేశం చేయటం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు చదువు పట్ల మంచి ఫలితాలు ఉన్నాయి. సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి.
మకరరాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు. ఒంటరి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. కొత్త పరిచయాలు మీ జీవితంలోకి రావడం వల్ల సంతోషంగా ఉంటారు. సమయం అనుకూలంగా ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వాళ్లకు అనుకూలంగా ఉంది. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు మరోసారి వాయిదా వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్ణయం తీసుకున్న కూడా తల్లిదండ్రులకు తెలియజేయాలి. కొన్ని ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.