Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మార్చి 28, 2023 పంచాగం
తేది : 28, మార్చి 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి సాయంత్రం 7.02ని.
నక్షత్రం : మృగశిర సాయంత్రం 5.32ని.
వర్జ్యం : ఉదయం 2.50ని॥ నుంచి 4.37ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి 11.15ని. నుండి 12.00ని.
రాహుకాలం : మధ్యాహ్నం 3.00ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.17ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.24ని.ల వరకు
మేష రాశి: ఈ రాశి వారు వివిధ కోణాలలో విజయం సాధిస్తారు. ఈరోజు సాయంత్రం వరకు మంచి శుభవార్త వింటారు. నిర్ణీత సమయానికంటే ముందే పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల కీర్తి పెరుగుతుంది. వివాహం కాని వాళ్లకు సంబంధాలు కుదురుతాయి. విలువైన వస్తువులు కొంటారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఆస్తులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కుటుంబ సభ్యుల మద్దతు అందుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.
మిధున రాశి: ఈ రాశి వారికి మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత విషయాలను బయటకు పంచుకోకూడదు. సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అంతా మంచే జరుగుతుంది. ఏ పని ప్రారంభించిన కూడా సక్రమంగా పూర్తవుతుంది. ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలు తగ్గిపోతాయి. దీనివల్ల జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
సింహరాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆశ చూపుతారు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా మీ మిత్రులు కలుస్తారు. కొన్ని కోర్టు సంబంధిత విషయాలలో విజయాన్ని సాధిస్తారు.
కన్య రాశి: ఈ రాశి వారి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటికి బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
తుల రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కోల్పోయిన వస్తువులు తిరిగి అందుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తల్లిదండ్రుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామి సహాయాన్ని అందుకుంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. సమయాన్ని కంటే ముందుగానే పనులు పూర్తి చేస్తారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలోకి కొత్త పరిచయాలు వస్తాయి. త్వరలో ఓ ఇంటి వారు అయ్యే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. మీ ప్రేమ జీవితం ఫలిస్తుంది. సమయాన్ని కాపాడుకోవాలి. కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహన కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రులతో వాదనలకు దిగకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి: ఈ రాశి వారు ఈ రోజు సంతోషకరమైన వార్త వింటారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. గతంలో దూరం చేసుకున్న బంధువులు మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. సంతానం నుండి శుభవార్త వింటారు. ఒంటరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. పాత స్నేహితులను కలుస్తారు.
మీన రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. శత్రువులు మిత్రులు అవ్వడం వల్ల సంతోషంగా ఉంటారు. కొన్ని పనులు పూర్తి చేసేటప్పుడు ఇతరుల సహాయం అందుకుంటారు. ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.