Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మార్చి 9, 2023 పంచాగం
తేది : 9, మార్చి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : గురువారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : విదియ రాత్రి 8.54ని.
నక్షత్రం : ఉత్తర ఉదయం 4.20ని. హస్త
వర్జ్యం : మధ్యాహ్నం 2.21ని॥ నుంచి 4.02ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని నుండి 11.05ని. తిరిగి 3.21ని. నుండి 4.12ని.
రాహుకాలం : మధ్యాహ్నం 1.30ని.ల నుంచి 3.00ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.32ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.20ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఈరోజు అద్భుతంగా కొనసాగుతుంది. కొందరు బంధువులు ఇంటికి వస్తారు. నీ జీవితంలోకి కొత్త పరిచయాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు స్నేహితుల సహాయం అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిధున రాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు మార్చుకోకూడదు. మీ ఇంటికి సంబంధించిన విషయంలో బాగా ఆలోచనలు చేయాలి. ఆర్థికంగా బలపడుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఒక పనిని మొదలు పెడితే పూర్తి చేసే వరకు అందులోనే ఉంటారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. ఒక విషయం మిమ్మల్ని సంతృప్తి కలిగిస్తుంది. రక్తసంబంధితులతో విభేదాలు వస్తాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు అనుకూలంగా ఉంది.
సింహరాశి: ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. మీరు పనిచేసే చోట మంచి గౌరవం అందుకుంటారు. మంచి గౌరవం ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కన్య రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు మీకు మంచి ఫలితాలు అందిస్తాయి. కొందరి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. ఒక విషయం పట్ల సంతోషంగా ఉంటారు.
తుల రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు. ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది. కొందరు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. కొందరి వ్యక్తులను ఎక్కువగా నమ్మకూడదు. సమయం అనుకూలంగా ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల నుండి శుభవార్త వింటారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని కాపాడుకోవాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. ఇతరులు మీకు ధైర్యం ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వల్ల ఒక శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. పనిచేసే చోటే జాగ్రత్తగా ఉండాలి.
మకరరాశి: ఈ రాశి వారు అనవసరమైన విషయాల పట్ల బాగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగురుతారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి.
కుంభరాశి: ఈ రాశి వారు ఒక శుభవార్త వింటారు. దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకూడదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారికి అన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. తొందరపడి ఎటువంటి మాటలు ఇవ్వకూడదు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కాస్త ఆలోచించాలి.