Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మే 1, 2023 పంచాగం
తేది : 1, మే 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి రాత్రి 10:10ని.
నక్షత్రం : పుబ్బ సాయంత్రం 05:51ని.
వర్జ్యం : ఉదయం 1.36ని॥ నుంచి 3.19ని॥ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.47ని నుండి 1.38ని. తిరిగి 3.20ని. నుండి 4.11ని.
రాహుకాలం : ఉదయం 7.30ని.ల నుంచి 9.00ని.ల వరకు
యమగండం : ఉదయం 10.38ని.ల నుంచి 12.19ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.54ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.32ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు ఒక శుభవార్త వినడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ వ్యాపారాలు చక్కబడతాయి. గతంలో కోల్పోయిన వస్తువులు త్వరలో అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్న కూడా కాస్త ఆలోచించాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేయటానికి ఆలోచనలు చేస్తారు. కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో చెప్పకపోవటమే మంచిది. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.
మిధున రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శత్రువులు కలిసి పోవడం వల్ల కాస్త సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న కూడా తల్లిదండ్రులతో తెలపడం మంచిది. భూమిని కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకు ఈరోజు అనుకూలంగా ఉంది. కొందరు నూతన గృహప్రవేశాలు చేస్తారు.
సింహరాశి: ఈ రాశి వారు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లల నుండి శుభవార్త వింటారు. చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి.
కన్య రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల గురించి పదేపదే ఆలోచనలు చేయకపోవడం మంచిది. ఇతరులను దూరంగా ఉంచాలి. కొత్త పనులు ప్రారంభించడానికి మీలో ఆసక్తి ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
తుల రాశి: ఈ రాశి వారు కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు. సంపాదించే స్తోమత కూడా ఎక్కువగా ఉంది. పిల్లల ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. పాత స్నేహితులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు తమ పెద్దల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేయడం మంచిది. కొన్ని ప్రయోగాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. సమయం అనుకూలంగా ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు.
మకరరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేయటం వల్ల కాస్త మనశాంతి కలుగుతుంది.
కుంభరాశి: ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా తొందరపడకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు. సమయాన్ని కాపాడుకోవాలి.
మీన రాశి: ఈ రాశి వారు కొత్తగా పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తల్లిదండ్రులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. తీరిక లేని సమయంతో గడిపే వాళ్లకు ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.