Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మే 15, 2023 పంచాగం
తేది : 15, మే 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : దశమి ఉదయం 02:46ని. ఏకాదశి
నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 09:08ని.
వర్జ్యం : సాయంత్రం 6.23ని॥ నుంచి 7.55ని॥ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.47ని నుండి 1.38ని. తిరిగి 3.20ని. నుండి 4.11ని.
రాహుకాలం : ఉదయం 7.30ని.ల నుంచి 9.00ని.ల వరకు
యమగండం : ఉదయం 10.38ని.ల నుంచి 12.19ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.48ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.36ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళు కాస్త శ్రద్ధగా ఉండాలి. వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. తోబుట్టువులతో అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఇతరులు మీ సొమ్ముని తిరిగి ఇస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. గతంలో కోల్పోయిన కొన్ని వస్తువులు తిరిగి అందుకుంటారు. వ్యాపారస్తులు సొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి లాభం ఉంటుంది.
మిధున రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాల పట్ల బాగా నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉండటంవల్ల ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: ఈ రాశి వరకు కొన్ని ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి. కొందరు కొత్త పరిచయాలకు దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేవాళ్ళు కుటుంబ సభ్యులతో చర్చించాలి. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలి.
సింహరాశి: ఈ రాశి వారు ఇతరులకు సహాయం చేస్తారు. అనుకోకుండా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో మరింత ఆలస్యం చేస్తారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి. కొన్ని సమస్యలు తల మీదికి తెచ్చుకోకూడదు.
కన్య రాశి: ఈ రాశి వారు చేయాల్సిన పనులు సరైన సమయానికి చేయరు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యక్తుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తుల రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది. ఏ పని చేసిన కూడా కాస్త ఆలోచించి చేయాలి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేసుకోవడం వల్ల సమయాన్ని కాపాడుకోవచ్చు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కొన్ని ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. గత కొన్ని రోజుల నుండి బాధపడుతున్న కొన్ని సమస్యల నుండి బయటపడతారు. దూరపు బంధువుల నుండి కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.
మకరరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల సహాయం అందుకుంటారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఇతరుల సొమ్ము అందుతుంది. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తారు.
మీన రాశి: ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల నిర్లక్ష్యం చేశారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఇతరులు మీ వ్యక్తిగత విషయాల పట్ల చులకన చేస్తుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం అందుకుంటారు.