Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: మే 2, 2023 పంచాగం

తేది : 2, మే 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి రాత్రి 11:18ని.
నక్షత్రం : ఉత్తర రాత్రి 07:41ని.
వర్జ్యం : సాయంత్రం 4.31ని॥ నుంచి 6.12ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి 11.15ని. నుండి 12.00
రాహుకాలం : మధ్యాహ్నం 3.00ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.53ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.32ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు ఈరోజు తమ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలెను. తరచు ప్రయాణములు చేయవలసి వస్తుంది. మీ గృహమునందు శుభకార్యములు జరుగుతాయి. సాంకేతిక రంగానికి చెందిన వాళ్ళు అభివృద్ధి చెందుతారు.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు తగిన లాభములు కలుగుతాయి. కొత్తగా పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బంధువర్గము వారితో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధున రాశి: ఈ రాశి వారికి తమ సోదరులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాల యందు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారికి కొన్ని సమస్యల వల్ల ప్రశాంతత దూరం అవుతుంది. కొన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు పరిష్కరించవలసి ఉంటుంది. కొందరు కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. సమయంను కాపాడుకోవాలి.

సింహరాశి: ఈ రాశి వారికి ఆదాయం నుంచి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొన్ని కోర్టు వ్యవహారాలు పరిష్కరించుకోవడం కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏ పనినైనా గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరి.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వాళ్ళు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొన్ని ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి: ఈ రాశి వారు ప్రారంభించిన పనుల యందు మంచి విజయాన్ని అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. అన్నదమ్ములతో విభేదాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేయవలసి వస్తుంది. కొన్ని విషయాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ధనుస్సు రాశి: రాశి వారు కొన్ని సమస్యలను కుటుంబ సభ్యులతో పరిష్కరించుకుంటారు. కొన్ని పనులు త్వరగా పూర్తి చేయవలసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మకరరాశి: ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని చికాకులు కలుగుతాయి. అందరూ కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు. కొన్ని వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

కుంభరాశి: ఈ రాశి వారు కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల ద్వారా లాభాలు అందుకుంటారు. సమయం అనుకూలంగా ఉంది.

మీన రాశి: ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం మంచిది. లేనిపోని విషయాలు తల మీదకు తెచ్చుకోకూడదు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on మే 2, 2023 at 12:00 ఉద.