Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మే 23, 2023 పంచాగం
తేది : 23, మే 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి పూర్తి
నక్షత్రం :ఆరుద్ర మధ్యాహ్నం 12:38ని.
వర్జ్యం : ఉదయం 1.52ని॥ నుంచి 3.38ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి 11.15ని. నుండి 12.00ని.
రాహుకాలం : ఉదయం 3.00ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.46ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.39ని.ల వరకు
మేషరాశి: రాశి వారికి ఈ రోజు తమ శ్రమకు తగ్గిన ప్రతిఫలం అందుతుంది. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఉంటారు. ముఖ్యమైన విషయాలలో ఒత్తిడి అస్సలు పెంచుకోకూడదు. కొన్ని పనులల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. మీకు తోచిన సహాయం ఇతరులకు చేస్తూ ఉండాలి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు వెంటే ఉంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఆర్థికంగా మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని ఆలోచనలతో పనులు త్వరగా పూర్తి చేస్తారు.
మిధున రాశి: ఈ రాశి వారు మానసికంగా ధైర్యంగా ఉండాలి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని గొడవలకు దారి ఇవ్వకూడదు. ఆస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఆలోచనలు చేయాలి. ఇతరుల మాటలు ఎక్కువగా నమ్మకపోవటం మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచించకుండా ఎటువంటి పనులు మొదలు పెట్టకూడదు. ఇతరులను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు.
సింహరాశి: ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. ఆవేశపరమైన పనులు చేయకూడదు. ఇతరులకు ఇచ్చే సలహాలు వారికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. తమ రంగాలలో ముందుకు దూసుకుపోతారు. అదృష్టవంతమైన కాలం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు.
తుల రాశి: ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సరైన ఆలోచనలతో పూర్తి చేయటం మంచిది. భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. కొందర్ని అతిగా నమ్మకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు సరైన సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది. కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల సంతోషకరంగా ఉంటారు.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ రోజు మంచి గౌరవం అందుతుంది. బుద్ధిబలంతో మంచి ఫలితాలు అందుకుంటారు. స్నేహితులను కలుస్తారు. కొన్ని పనులల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేయకూడదు.
కుంభరాశి: ఈ రాశి వారు ముఖ్యమైన విషయాల పట్ల ధైర్యంగా ఉండాలి. ఇతరుల మాటలు అంత త్వరగా నమ్మకూడదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆర్థికంగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులు పై అధికారుల సలహాలు అందుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా ధైర్యంగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.