Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మే 25, 2023 పంచాగం
తేది : 25, మే 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి ఉదయం 03:01ని. షష్టి
నక్షత్రం : పుష్యమి సాయంత్రం 05:53ని.
వర్జ్యం : ఉదయం 8.15ని॥ నుంచి 10.03ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని నుండి 11.05ని. తిరిగి మధ్యాహ్నం 3.21ని. నుండి 4.12 ని.
రాహుకాలం : మధ్యాహ్నం 1.30ని.ల నుంచి 3.00ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.45ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.40ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలలో భయాందోళనకు గురవుతారు. ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ముఖ్యమైన పనిలో త్వరగా పూర్తి చేసుకోవాలి. కొంతమందికి తమ పనులలో తగిన ప్రతిఫలం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి: ఈ రాశి వారిని ఇతరులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. చేసే పనులలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు.
మిధున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. ఇష్టమైన వ్యక్తులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బుద్ధి బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సరైన కాలంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. శుభ ఫలితాలు అందుతాయి. పిల్లల నుండి శుభవార్త వింటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలలో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చించాలి. చేయాల్సిన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విజయాలు మీ సొంతమవుతాయి. శత్రువులకు చాలా దూరంగా ఉండాలి.
సింహరాశి: ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. పెద్దల నుండి ప్రశంసలు అందుతాయి. ఉద్యోగస్తులు ఒక శుభవార్త వింటారు. సమయం అనుకూలంగా ఉంది.
కన్య రాశి: ఈ రాశి వారు మొదలుపెట్టే పనులలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి సమస్య బయటపడుతుంది.
తుల రాశి: ఈ రాశి వారు ఈ రోజు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు కొన్ని పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ప్రారంభించిన పనులలో ఇతరుల సహాయం అందుకుంటారు. గత కొన్ని రోజుల నుండి బాధపడుతున్న ఇబ్బందుల నుండి బయటపడతారు. ముఖ్యమైన విషయాలలో ఊహించని ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఒక శుభవార్త వినడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని కలహాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులు సరైన సమయంలో పూర్తి చేయాలి. బంధువులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
మకరరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా ఖర్చులు తగ్గించుకోవాలి. త్వరలో ఒక శుభవార్త వింటారు. మీ ఆరోగ్యం పట్ల తగ్గిన శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉన్నాయి.
కుంభరాశి: ఈరోజు కుటుంబ సభ్యుల సహకారం మీకు అందుతుంది. ఆర్థికంగా పొదుపు చేయాలి. ముఖ్యమైన విషయాలలో ఓర్పుగా ఉండాలి. అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
మీన రాశి: ఈ రాశి వారు ఇతరులకు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. అందర్నీ కలుపుకోవడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి. ఆవేశ నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించాలి.