Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: మే 26, 2023 పంచాగం
తేది : 26, మే 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ట మాసం
ఋతువు : గ్రీష్మఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి ఉదయం 05:19 ని. సప్తమి
నక్షత్రం : ఆశ్లేష రాత్రి 08:50ని.
వర్జ్యం : ఉదయం 10.16ని॥ నుంచి 12.04ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి మధ్యాహ్నం 12.48ని. నుండి 1.39ని.
రాహుకాలం : ఉదయం 10.30ని.ల నుంచి 12.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 3.41ని.ల నుంచి 5.21ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.45ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.40ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలిసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఇతరుల సహాయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకు కొంతవరకు అనుకూలంగా ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులల్లో బద్దకాన్ని దూరం పెట్టాలి. కొన్ని ప్రయత్నాలు మీకు బాగా ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి.
మిధున రాశి: ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో ఒత్తిడి పెంచుకోకూడదు. ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్ని పనులు త్వరగా పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేస్తారు. శత్రువులను దరికి చేరనివ్వకండి.
సింహరాశి: ఈ రాశి వారికి శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఈరోజు అందుతుంది. అవసరానికి డబ్బులు అందుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి.
కన్య రాశి: ఈ రాశి వారు ధైర్యంతో కొన్ని సమస్యలను తొలగించుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆలోచించి చేయాలి. ఈరోజు ఊహించని ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఇంట్లో వారందరినీ సంతోష పెడుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
తుల రాశి: ఈ రాశి వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మొదలు పెట్టిన పనులు పూర్తి చేయాల్సిందే. మీలో ఏకగ్రత తగ్గకుండా చూసుకోవాలి. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకూడదు. సమయాన్ని వీలైనంత కాపాడుకోవాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మీ బుద్ధి బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులను అతిగా నమ్మకూడదు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి.
మకరరాశి: ఈ రాశి వారు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయటం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రల వంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. కొన్ని విషయాల పట్ల నిరుస్తాహం చెందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ధైర్యంగా ఉండాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సహాయం అందుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్న బాగా ఆలోచనలు చేయాలి. తొందరపడి విలువైన వస్తువులు కొనుగోలు చేయకూడదు. మీ వ్యక్తిగత విషయాల పట్ల కొందరు జోక్యం చేసుకుంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.