Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs అక్టోబర్ 2, 2022 పంచాగం

తేది : 2, అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
మాసం : అశ్వయుజ మాసం
ఋతువు : శరదృతువు
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి సాయంత్రం 6.47ని
నక్షత్రం : జేష్ట ఉదయం 3.11ని.ల మూల
వర్జ్యం : ఉదయం 10.53ని॥ నుంచి 12.24ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని. ల నుండి 5.53
రాహుకాలం : సాయంత్రం 4.30 ని.ల నుంచి 6.00 ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.10ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6:01ని.ల వరకు

మేషరాశి: ఈరాశి వారు సంతోషంగా ఉంటారు. ఏ పనిని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది. అనుకోకుండా కొన్ని దూరప్రయాణాలు చేస్తారు. అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేయకండి. ఈరోజు అనుకూలంగా ఉంది.

వృషభరాశి: ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

మిథునరాశి: ఈరాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. వాహన కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని దూరప్రయాణాలు చేయడంవల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకరాశి: ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పాత స్నేహితులను కలవడం వల్ల వారితో వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.

Zodiac Signs
Zodiac Signs

సింహరాశి: ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కన్యరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

తులరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా పొదుపు చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

వృశ్చికరాశి: ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సురాశి: ఈరాశి వారు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో ఎక్కువగా పంచుకోకండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మకరరాశి: ఈ రాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా తీసుకోవాలి. ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం మరింత ఆలస్యం చేస్తారు. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీనరాశి: ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉంటాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on అక్టోబర్ 2, 2022 at 12:00 ఉద.