ఫోన్‌లో అవి చూస్తున్నారా… అయితే జైల్లో ఊచలు లెక్క బెట్టక తప్పదు…

Jaya Kumar

మన దేశంలో మహిళలపై , చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాళ్లు అభం శుభం తెలియని చిన్నారులపై హత్యాచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి నుంచి మైనర్లను రక్షించుకునేందుకు… కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇటువంటి ఘటనలకు ముఖ్య కారణమైన అశ్లీల వెబ్ సైట్లపై నిఘా పెట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించారు. కానీ కొంతమంది మాత్రం విచ్చలవిడిగా అదే పనిగా పోర్న్‌ సైట్స్‌ వీక్షిస్తున్నారు.

ఇప్పుడు అలాంటి వారికి ఓ హెచ్చరిక … ఇంటర్నెట్ ఉంది కదా అని… అడ్డమైనవన్నీ చూస్తామంటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ సైట్ లను చూడాలి అనుకునే వాళ్ళు… శిక్ష అనుభవిచాల్సిందే అని పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించి అశ్లీల చిత్రాలు, చైల్డ్‌ పోర్న్‌ సైట్స్‌ కోసం సెర్చ్‌ చేసే వారిపై… ఎన్ సి ఆర్ బి ఫోకస్‌ పెట్టింది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో పరిధిలో చైల్డ్‌ సెక్స్‌ అభ్యూజ్ మెటీరియల్‌ అనే ప్రత్యేక సెల్‌ ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ లో ఎవరు ఏమేం చేస్తున్నారో అని చూడటమే ఈ సెల్‌ ముఖ్య ఉద్దేశం. చైల్డ్‌ పోర్న్‌ సైట్స్‌ చూడటమే కాకుండా … గూగుల్‌లో చైల్డ్‌ పోర్న్‌ అని టైప్ చేసిన వెంటనే వాళ్లకు సమాచారం అందుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇందులో భాగంగానే బాలల అశ్లీల ఫోటోలు, వీడియోలు చూస్తున్న 16 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఐపీ అడ్రస్ ఆధారంగా… వారంతా హైదరాబాద్ కు చెందిన గుర్తించారు. వారిపై ఐటి యాక్ట్ 67 బి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎన్ సి ఆర్ బి ఆదేశించింది. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. గతేడాది కూడా ఇదే తరహాలో సిఐడి పంపించిన ఐపీ అడ్రస్‌ల ద్వారా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం అందరికి తెలిసిందే.

- Advertisement -