Gopichand : సినిమా ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్ట్ మొదలైనట్టు మొదలై ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. షూటింగ్ డేట్ కూడా ప్రకటిస్తారు. కానీ కథ విషయంలోనో..మరేదైనా సమస్యలు తలెత్తడంతోనో ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. కొన్ని సినిమాలు సగం షూటింగ్ అయ్యాక సినిమా ఫ్లాప్ అనే అంచనాకి వచ్చి ఆపేస్తారు. కొన్ని సినిమాలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఆగిపోతాయి. ఏ స్థాయిలో సినిమా ఆగిపోయినా ఫైనల్‌గా నష్టపోయోది నిర్మాతే.

2 crores advance is returned by gopichand
2 crores advance is returned by gopichand

అందుకే ప్రాజెక్ట్ అగిపోయిందని తెలియగానే టాలీవుడ్ హీరో నిర్మాత అడ్వాన్స్‌గా ఇచ్చిన 2 కోట్లు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడు. ఆ హీరోనే మాచో హీరో గోపీచంద్. ఆయన హీరోగా టాలీవుడ్ నిర్మాత భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని నిర్మించడానికి ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు రెమ్యునరేషన్ లో భాగంగా నిర్మాత గోపీచంద్ కి 2 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చాడు. అయితే గత ఏడాది టాలీవుడ్ లో కరోనా వల్ల పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అందుకే నిర్మాత ముందు జాగ్రత్తగా ప్రాజెక్ట్ ఆపేశాడు.

Gopichand : నిర్మాతల కష్టాలు బాగా తెలిసిన వ్యక్తి గోపీచంద్

దాంతో గోపీచంద్ నిర్మాత ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేశాడు. చాలా మంది మళ్ళీ ప్రాజెక్ట్ మొదలయ్యే వరకు ఆ డబ్బు తిరిగివ్వరు. ఎప్పుడో ఒకప్పుడు మొదలవకపోతుందా అని ఆలోచనలో ఉంటారు. కానీ గోపీచంద్ తండ్రి ఒక నిర్మాత. నిర్మాతల కష్టాలు బాగా తెలిసిన వ్యక్తి. అందుకే గోపీచంద్ ఇలా తీసుకున్న అడ్వాన్స్ రిటన్ ఇవ్వడం గొప్ప విషయం. ఈ విషయంలో టాలీవుడ్ ప్రముఖులందరూ గోపీచంద్ ని ప్రశంసించారు. ఇక గోపీచంద్ నటించిన సీటీమార్ రిలీజ్ కి రెడీగా ఉంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించాడు. ఇక మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమాను చేస్తున్నాడు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 25, 2021 at 7:57 సా.