7th Pay Commission : పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ ఇస్తుంది, దీనిని డిఎ అంటారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటె జులై లేదా ఆగస్టు నెలలో కేంద్రం నుంచి డీఏ కి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం వుంది.
7వ వేతన సంఘం ప్రకారం..విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం ప్రభుత్వ డియర్నెస్ అలవెన్స్(డీఏ) మరోసారి పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి రెండుసార్లు డియర్నెస్ అలవెన్స్ను సవరిస్తారు. మొదటిది సవరణ జనవరి నుంచి జూన్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవది జులై నుంచి డిసెంబర్ సవరణ చేస్తారు . ఈ ఇప్పుడు 2022 సంవత్సరానికి గాను మార్చిలో డిఎ మొదటి పెంపుదల గురించి కేంద్రం ప్రకటించారు. అయితే సవరించిన డి అ గురించి ఏఐసీపీ ఇండెక్స్లో పెరుగుదల కారణంగా ఇంకోసారి పునఃసమీక్ష జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

7th Pay Commission జులై నెలలో లో డీఏ పెరిగే అవకాశం ఎంత వరుకు వుంది…..
అయితే ప్రస్తుత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మరో నాలుగు శాతం వరకు డీఏ పెరగవచ్చు. అంటే మొత్తం 38 శాతానికి డీఏ చేరువ అయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి . డీఏ పునః సమీక్ష లో కీలక పాత్ర అయిన మార్చి ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలు డీఏ పెంపునకు అంగీకరించాయి. దీని ప్రకారం జూలై-ఆగస్టు సమయంలో డీఏ పెంపు దాదాపు 4 శాతం కి రావచ్చు, అయితే ACPI గణాంకాలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్దారణ చేయలేదు.
ధరల పెరుగుదలను భర్తీ చేసేందుకు , అంతే కాకుండా 1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పింఛనుదారులకు లబ్ధి పొందేల చేయడం కోసం డియర్నెస్ అలవెన్స్ (డిఎ), డియర్నెస్ రిలీఫ్ (డిఆర్)లను 3 శాతం నుండి 34 శాతానికి పెంచతూ కేంద్ర మంత్రివర్గం మార్చి 30న తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పెంచిన వాయిదా లబ్దిదారులకు 2022, జనవరి 1నుంచి అమల్లోకి వస్తుంది. అయితే 7వ కేంద్ర వేతన సంఘం సలహాల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములా ప్రకారం ఈ వేతన పెంపు ఉంటుంది. కాకపోతే ఇటీవల ప్రకటనలో చెప్పినట్టు జులై నెలలో నిర్ణయించబడే తదుపరి కొత్త డీఏ మీద కూడా ఉద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులలో ఆశలు పెరిగాయి.