Sardar : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సుల్తాన్ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన స్టైల్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న
విషయం తెలిసిందే. ఈ సినిమాతో కార్తీ తన ఖాతాలో మరో కమర్షియల్ హిట్ ను వేసుకున్నాడు. ఇదిలా ఉండగా కార్తీ ప్రస్తుతం సర్దార్ సినిమాలో హీరోగా
నటిస్తున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు.

a-heavy-budjet-for-sardar-movie
a-heavy-budjet-for-sardar-movie

ఎన్నో సినిమాలని చేసిన రాశి ఖన్నా ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోయిన్ గా హిట్ కొట్టెందుకు చాలా కష్టపడుతుంది. కార్తీ ఇదివరకు చేసిన సినిమాల కంటే భిన్నంగా కనపడేలా పాత్రను డిజైన్ చేసినట్లు ఇటీవలే విడుదలయిన సర్దార్ సినిమా ఫస్ట్ లుక్ తో తెలుస్తుంది. ఈ మాసి, రఫ్ లుక్
యూత్ ని తెగ ఆకట్టుకునేలా ఉంది. కార్తీ చింపిరి గడ్డంతో రఫ్ గా కనిపించి సినిమాపై అంచనాలు పెంచేశాడని ఎక్కువగా మాస్ ఆడియన్స్ ని
ఆకట్టుకుంటుందని టాక్. సుల్తాన్ తరువాత సినిమా అవడంతో సర్దార్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Sardar : కరోనా సెకండ్ వేవ్‌ను లెక్క చేయని సర్దార్.

కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందిన సమచారం ప్రకారం ఈ సినిమాలో జైలుకు సంబంధించిన సన్నివేశాల కోసం భారీ బడ్జెట్ తో ఒక భారీ సెంట్రల్ జైలు సెట్టింగ్ ను నిర్మించారట మేకర్స్. అయితే ఇందులో చాలా కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సమచారం. ఈ సీన్స్ సినిమాలోహైలెట్ గా నిలవబోతున్నాయని.. అందుకే సెట్ కోసం భారీగా ఖర్చు చేసారని టాక్. ఏది ఎలా ఉన్న కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటున్నారట. కార్తీకి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో వేచి చూడాల్సిందే.

 

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 9, 2021 at 5:00 సా.