Star Heros: కాస్టింగ్ కౌచ్.. ఈ పేరు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ని ఎంతో మంది హీరోయిన్లు ఎదుర్కొన్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్ లు వారికి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను మీడియాతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్ లో ఈ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది అని అక్కడి నటిమణులు చెబుతున్నారు. అయితే ఈ పలువురు బాలీవుడ్ హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ పలువురు హీరోల పేర్లు దర్శకుల పేర్లు బయటపెట్టారు.
ఆ వివరాలు వెళితే.. బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ఎ లిస్ట్, బి లిస్ట్, బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరూ కోరుకున్నది ఒక్కటే..సెట్స్ లో అమ్మాయి భార్యలా ప్రవర్తించాలి అని వారు ఆశించారు. కేవలం ఆ సినిమా హీరో మాత్రమే కాకుండా తదుపరి హీరో కూడా అదే కోరుతాడు ఇదే ఇండస్ట్రీ నిజం అని చెప్పుకొచ్చింది కంగానా రనౌత్. అయితే కంగానా అగ్ర హీరోలతో పాటు అగ్ర దర్శక నిర్మాతలు కూడా ఆ కాస్టింగ్ కౌచ్ జాబితాలో ఉన్నారు అని ఆమె తెలిపింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలు అని చెప్పవచ్చు. ఒక సౌత్ అగ్ర నటుడు తన రూమ్ ఫోన్ కి కాల్ చేసి సరసాలు ఆడేందుకు ప్రయత్నించాడని ఆమె తెలిపింది. అలాగే బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేసింది.
Star Heros: కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్న హీరోయిన్లు..
తన మోడలింగ్ రోజుల నుండి బాలీవుడ్ లో ఎదిగేంత వరకు ప్రతి ఒక్క చోట ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అని చెప్పుకొచ్చింది. అలాగే టిస్కా చోప్రా కూడా ఒక అగ్రదర్శకుడితో కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొనట్లు ఆమె తెలిపింది. మరొక నటి సుర్వీన్ చావ్లా. ఈమె కూడా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఒక దర్శకుడు తనతో కలిసి విశ్రాంతి తీసుకోవాలని కోరాడు అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఆ దర్శకుడు ఆమెతో నేను మీ శరీరంలో ప్రతి అంగుళం ఎలా ఉంటుందో చూసి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అన్నాడట. అలాగే నానా పటేకర్ లాంటి అగ్ర నటుడు తనను వేధించాడు అంటూ ప్రముఖ కథానాయక తను శ్రీ దత్త ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ గాయని చిన్మయి తమిళ సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తు వేధింపులకు గురి చేశాడు అంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. కేవలం వీరు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ బారిన పడ్డారు.