Vijayendra prasad : పాన్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఆయన అందించే కథలు ఇప్పుడు పాన్ ఇండియన్ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. సింహాద్రి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఎన్.టి.ఆర్ కెరీర్ లో భారీ హిట్ నమోదు చేసుకుంది. వాస్తవంగా ఈ కథ నటసింహం నందమూరి బాలకృష్ణ చేయాల్సింది. దర్శకుడు బి.గోపాల్. కానీ బాలయ్యకి ఈ కథ నచ్చలేదట. దాంతో పక్కన పెట్టేశారు.

a-person-should-lie-to-enter-into-industry-says-vijayendra-prasad

ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ విఎంసి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అగ్ర నిర్మాత విఎంసి దొరస్వామీరాజు తనయుడు ఈ సినిమాకి నిర్మాత. ఆ సంస్థలో ఎన్.టి.ఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేశారు. అయితే ఎంతకీ కథ సెట్ అవడం లేదట. దాదాపు 60 నుంచి 70 కథలు విన్నారట. ఎన్.టి.ఆర్ కి అప్పటికీ ఓ భారీ ఫ్లాప్ పడటంతో మంచి కసి మీదున్నాడు. ఆ సమయంలో కేవలం 15 నిముషాలే కథ విని 16వ నిముషంలో ఓకే చేశాడు. ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. అంతక ముందు సమరసింహా రెడ్డికి కథ అందించారు.

Vijayendra prasad : ఇండస్ట్రీకి రావాలనుకుంటే అబద్దాలు బాగా చెప్పాలి.

అలా రాజమౌళి తెరకెక్కించే సినిమాలకి ఆయన తండ్రే కథలను అందిస్తున్నారు. బాహుబలి, మణికర్ణిక, భజరంగీ భాయ్ జాన్ లాంటి పాన్ ఇండియన్ కథలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు కూడా ఎన్.టి.ఆర్, రాం చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కి కథ అందించారు. అయితే ఇండస్ట్రీలో మీరు తెలుసుకున్న విషయం ఏమిటని అన్న ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ అబద్దాలు చెబితేనే ఎక్కువ కాలం నిలబడతారని చెప్పుకొచ్చారు. రచయిత గానీ, దర్శకుడు గానీ..మరెవరైనా ఇండస్ట్రీకి రావాలనుకుంటే అబద్దాలు బాగా చెప్పాలని సరదాగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 1, 2021 at 11:33 ఉద.