Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమానే విక్టరీ వెంకటేశ్ సరసన నటించే అవకాశం అందుకుంది. అమెరికా నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ డెబ్యూ సినిమా ఎంట్రీ అదిరిపోయింది. వెంకటేశ్, సురేష్ బాబు, విజయ భాస్కర్, త్రివిక్రం లాంటి క్రేజీ టీం తో పనిచేయడం గొప్ప అవకాశం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నువ్వు నాకు నచ్చావ్ అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అందరికి తెగ నచ్చేసింది. తర్వాత ఇదే బ్యానర్ లో నువ్వు లేక నేను లేను సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్. ఇలా రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా మారింది.

aarthi-agarwal-might have got fame like kajal, pooja hegde

మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, జూనియర్ ఎన్.టి.ఆర్ తో అల్లరి రాముడు, ప్రభాస్‌తో అడవి రాముడు, నాగార్జున్‌తో నేనున్నాను, తరుణ్‌తో సోగ్గాడు, మహేష్ బాబుతో బాబీ, ఉదయ్ కిరణ్ తో నీ స్నేహం, రవితేజ తో వీడే.. ఇలా పెద్ద బ్యానర్స్ లో నటించే అవకాశం అందుకుంది. ఇంత క్రేజ్ ఉన్న హీరోయిన్ సినిమాల పరంగా బిజీగా ఉన్న ఆర్తి టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో పడింది. చాలా ఘాటు ప్రేమలో మునిగి తేలిందని వార్తలు వచ్చాయి. ఆ హీరోని పెళ్ళి చేసుకోబోతుందని ప్రచారం జరిగింది. కానీ హీరో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పాటు ఆర్తిని బెదిరించారని టాక్ వినిపించింది.

Aarthi Agarwal : సినిమాలు లేక ఇండస్ట్రీలో కనిపించడం లేదు.

పీకల్లోతు ప్రేమలో మునిగిన ఆర్తి అగర్వాల్ ప్రేమ విషయంలో విఫలమవడంతో మనస్తాపానికి గురై సినిమాల మీద ఫోకస్ పెట్టలేకపోయింది. మానసికంగా కృంగిపోయిన ఆమె ఓ సందర్భంలో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే కుటుంబ సభ్యుల వల్ల సాధారణ స్థితికి వచ్చి మళ్ళీ సినిమాల మీద దృష్టి సారించింది. అయితే బాగా బొద్దుగా తయారవడంతో లైపో సర్జరీ చేయించుకుంది. ఆ సమయంలో ఆరోగ్యం దెబ్బతిని అకస్మాత్తుగా మృతి చెందింది. అయితే ఆర్తి కెరీర్ ఇలా అర్ధాంతరంగా ముగియడానికి కారణం మాత్రం యంగ్ హీరోతో ప్రేమ వ్యవహారమే అని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇక ఆ యంగ్ హీరో కెరీర్ కూడా దాదాపు ముగిసిపోయింది. సినిమాలు లేక ఇండస్ట్రీలో కనిపించడం లేదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 12, 2021 at 7:00 సా.