Abhishek Bachchan: కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలపై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల కాలంలో మన సౌత్ భాషలైన తెలుగు, తమిళం సహా మిగతా భాషలలో తెరక్కిన చిత్రాలకు అన్నీ భాషలతో పాటుగా బాలీవుడ్‌లోనూ విశేషమైన ఆదరణ లభిస్తోంది. దీనికి ఉదాహరణ కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలే. ఈ సినిమాలు హిందీలో కూడా విడుదలై వసూళ్ళ సునామీని సృష్ఠించాయి.
బాలీవుడ్ చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ కూడా మన సౌత్‌లో భారీ సక్సెస్ సాధించింది. దీనిని బట్టి చూస్తే మంచి సినిమాకు ఎక్కడైనా ఆదరణ ఉంటుందని అర్థమవుతోంది. ఇదే విషయాన్ని బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కూడా తెలిపారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దస్వీ’ అనే హిందీ చిత్రం తాజాగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించి హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజాగా అభిషేక్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో ఆయన ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
Abhishek Bbachchan: దానిమీదే ఆధారపడాటం లేదు కదా..!
పాన్ ఇండియా అనే పదంపై మీద నమ్మకం లేదన్న అభిషేక్..ఇప్పుడు వస్తున్న బాలీవుడ్ సినిమాలల్లో కంటెంట్ ఉండటం లేదనే మాటను ఏకీభవించలేదు. అంతేకాదు, భాష ఏదైనా ప్రతి నటుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమనే మాటను అభిషేక్ బచ్చన్ గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో కేజీఎఫ్ 2, పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాలు బాలీవుడ్ లో భారీగా వసూళ్లు రాబట్టాయి.
మంచి కథతో తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది ఖచ్చితంగా హిట్ సాధిస్తుంది. కథే లేకుంటే సినిమాల ఎక్కడైనా ప్లాప్ గానే మిగులుతుంది అన్నారు. బాలీవుడ్లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదా..మరి గంగుబాయి కతియావాడి, సూర్యవంశీ మంచి హిట్ సాధించాయి కదా..వీటిని ఏమనాలి అంటూనే, రీమేక్ అనేది ఎప్పుడూ జరుగుతూ వస్తున్నదే.. అది ఒక చాయిస్ మాత్రమే గానీ దానిమీదే ఆధారపడాటం లేదు కదా అన్నారు. మన ఇండియాలో సినీ ప్రియులు ఎక్కవ. వారికి సినిమా భాషతో పనిలేదు. ఏ భాషలో వచ్చిన ఫైనల్‌గా అది సినిమాగానే చూస్తారు. ఏఏ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే అన్నారు. అంతేకాదు, ఏదిఏమైనా మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే.’ అని అభిషేక్ బచ్చన్ సౌత్ సినిమాల మీద తన అభిప్రాయాన్ని తెలిపాడు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.