Acharya: ఆచార్య వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌కు చిరు – చరణ్ ఎంతిస్తున్నారో తెలుసా..?

G K

Acharya: అందరూ అనుకున్నదే జరిగింది. మెగా మల్టీస్టారర్‌గా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు తీవ్ర నష్టాలను మిగిల్చింది. దాదాపు నాలుగేళ్ళు ఆచార్య సినిమా సెట్స్‌పై ఉంది. ఈ నాలుగేళ్ళలో నాలుగు నుంచి 6 సినిమాలు తీయొచ్చు. కానీ, కరోనా ప్యాండమిక్‌తో పలుమార్లు కథ, కథనాలను మార్చడం వల్ల..ఇతర కారణాల వల్ల ఇన్నేళ్ళు పట్టింది. కాస్తో కూస్తో నిర్మాణ వ్యవయం కూడా పెరిగిపోయింది.

అయితే, అత్యంత భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు కావడం వరుస విజయాలతో మంచి క్రేజ్ మీదున్న కొరటాల శివ దర్శకుడు కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు వచ్చి ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అంతే సక్సెస్ ఆచార్య సినిమా కూడా అందుకుంటుం దని ప్రతీ ఒక్కరూ భావించారు. కానీ, మొదటి షోతోనే ఈ సినిమా ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది.

acharya-distributors are paid the amount back
acharya-distributors are paid the amount back

Acharya: ఆచార్య ఎంతటి డిజాస్టరో తేలిపోతుంది.

కనీసం మొదటి రోజు తర్వాతైనా ఆచార్య చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయి రెండవ రోజు చాలా చోట్ల సినిమాను ఎత్తేయడం ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని బటి చూస్తేనే ఆచార్య ఎంతటి డిజాస్టరో తేలిపోతుంది. అందుకే, తీవ్రంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌ను ఆదుకునేందుకు చిరు – చరణ్ కలిసి తమ రెమ్యునరేషన్ నుంచి ఒక్కొక్కరికి రూ.5 కోట్ల వరకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మిగతా వారికి చిరంజీవి తర్వాత సినిమా గాడ్ ఫాదర్ రైట్స్ ఇచ్చి కొంత వరకు సేవ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

 

- Advertisement -