Acharya: ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్ వచ్చేసింది..ఇండస్ట్రీ హిట్టో ఫట్టో చూడండి..

G K

Acharya: మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమాను ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో చూడని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించారు. ఇక మెగాస్టార్‌కు ఎంతో సెంటిమెంట్ అయిన మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ – ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది.

ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా కావడంతో అందరిలోనూ ఆతృత తారా స్థాయిలో ఉంది. ఇప్పుడు దానికి తగ్గట్టే ఫస్ట్ రివ్యూతో పాటుగా రేటింగ్ కూడా వచ్చేసి ఆ అంచనాలను మరో రేంజ్‌కు తీసుకెళ్ళాయి. ఇప్పటికే ఆచార్య సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఈ నేపథ్యంలో మెగా మల్టీస్టారర్ మూవీపై ప్రముఖ క్రిటిక్, యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు తన ఫస్ట్ రివ్యూను ఇచ్చారు.

acharya-first review and rating is here
acharya-first review and rating is here

Acharya: 4 స్టార్ రేటింగ్.. చిరంజీవి, రామ్ చరణ్ నటనపై ప్రశంసలు..

అంతేకాదు, ఏకంగా ఆచార్య సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇస్తూ చిరంజీవి, రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఆచార్య చిత్రం మాస్ ప్రేక్షకులకు పుల్ మసాలా అందించే సినిమా అని.. చిరు, చరణ్ తమ నటనతో అదరగొట్టేశారని ఉమైర్ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దాంతో ఆచార్య చిత్రం గ్యారెంటీగా మెగా అభిమానులకు పుల్ మీల్స్ అందించేలా ఉంటుందని తెలుస్తోంది. కాగా, శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవిలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది.

- Advertisement -