Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నరేష్ నటి పవిత్ర లోకేష్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. ఇక వీరిద్దరిలేషన్ గురించి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి చేసినటువంటి వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇకపోతే వినాయక చవితి సందర్భంగా ఓ బుల్లితెర కార్యక్రమంలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ జంటగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వేదికపై మాస్టారు మాస్టారు అనే పాటకు డాన్స్ చేయడమే కాకుండా ఒకరిపై మరొకరు ముద్దుల వర్షం కురిపించుకొని ఓ రేంజ్ లో రెచ్చిపోయారని చెప్పాలి. ఇక అనంతరం పవిత్ర లోకేష్ నరేష్ నీకు ముందుగా ఏమని పిలుస్తారు అనే విషయం గురించి కూడా ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ తెలియజేశారు.
ముద్దుల వర్షం కురిపించుకున్న నరేష్ పవిత్ర….
తాను నరేష్ ను ముద్దుగా రాయా అని పిలుచుకుంటాను అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ వెల్లడించారు. అయితే మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ ను అమ్ములు అంటూ ముద్దుగా పిలుచుకుంటానని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ కూడా వారి ముద్దుపేర్ల గురించి పలు సందర్భాలలో బయట పెట్టడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ కూడా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.