Pragathi : తెలుగులో పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నటి ప్రగతి ఎక్కువగా జిమ్ వర్కౌట్లు అలాగే సోషల్ మీడియా మాధ్యమాలలో ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే పాపులర్ అవుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో నటి ప్రగతికి రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ తోపాటు సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే నటి ప్రగతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు వీడియోలకే వచ్చేటువంటి కామెంట్లు మరియు లైక్ లకి కూడా బాగానే స్పందిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడిన లేదా కించపరిచే విధంగా మాట్లాడిన వెంటనే ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా నటి ప్రగతి ఓ పాటకి స్టెప్పు లేసింది. అంతటితో ఆగకుండా ఈ విడియో ని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోని నెటిజన్లతో పంచుకుంది. ఈ క్రమంలో ఏకంగా ఈ వీడియోకి నేను యంగ్ గా కనిపించడానికి ప్రయత్నించడం లేదు దేశోద్ధారకులారా… కేవలం నాకు నచ్చినట్లు ఉన్నాను అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ వీడియోలో నటి ప్రగతి కొంతమేర సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తూ బాగానే ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు ఫీదా అయ్యారు.
అయితే ఓ నెటిజన్ మాత్రం ఏకంగా అలాగే “మేడం బతకాలంటే ఇలాంటి బట్టలు వేసుకొని డాన్సులు చేయాలని మా వాళ్లకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ వీడియోని మా వాళ్లకు చూపించి ఇలాగే చేయమని చెబుతానంటూ థాంక్స్ చెప్పాడు. దీంతో నటి ప్రగతి ఈ కామెంట్ పై స్పందించింది ఇందులో భాగంగా ఏకంగా అది నాకు నచ్చిన బ్రతుకు నాయనా నువ్వు నీకు నచ్చినట్లు బ్రతుకు అంటూ రిప్లై ఇచ్చింది.” దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.