Akhil Akkeneni: అక్కినేని అఖిల్ జాతకంలో ఆ దోషం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

Akashavani

Akhil Akkeneni: కొత్త సంవత్సరం మొదలవడంతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సినీ సెలబ్రిటీల జాతకం చెబుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి అక్కినేని అఖిల్ గురించి కూడా షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా వేణు స్వామి ఈ ఏడాదిలో అఖిల్ సినీ కెరియర్ ఎలా ఉండబోతోంది, అతని జాతకం ఏం చెబుతుంది అనే విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా వేణు స్వామి అఖిల్ జాతకం గురించి మాట్లాడుతూ… అఖిల్ జాతకంలో నాగ దోషం ఉంది. ఇండస్ట్రీలో అఖిల్ ఎవరి సహాయం తీసుకోకుండా తనంతట తానే సినిమాలను ఎంపిక చేసుకొని, సినిమాలలో నటిస్తే తప్పనిసరిగా సినిమాలు మంచి విజయాలను అందుకుంటాయి. లేదంటే అతను ఇబ్బందులలో పడే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయని వేణు స్వామి వెల్లడించారు. ఇక ఈ నాగ దోషం కారణంగా అఖిల్ సినీ కెరీర్ లో అవకతవకలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. దీనికోసం సరైన పరిహారం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చని వేణుస్వామి వెల్లడించారు.

Akhil Akkeneni: అక్కినేని అఖిల్ జాతకంలో ఆ దోషం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!
Akhil Akkeneni: అక్కినేని అఖిల్ జాతకంలో ఆ దోషం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

Akhil Akkeneni: అఖిల్ విషయంలో నిజమైన వేణుస్వామి వ్యాఖ్యలు…

ఇక అక్కినేని వారసుడిగా అఖిల్ హీరోగా అఖిల్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా మొదటి వరుస మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అఖిల్ ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయితే గత ఏడాది బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజాహెగ్డే అఖిల్ జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అఖిల్ తన తదుపరి చిత్రం ఏజెంట్ పై దృష్టి పెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి అఖిల్ జాతకంలో వేణు స్వామి చెప్పిన విధంగానే జరుగుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.అయితే వేణుస్వామి గతంలో అక్కినేని నాగచైతన్య సమంత విషయంలో చెప్పిన వ్యాఖ్యలు నిజం కావడంతో ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కూడా అఖిల్ నిశ్చితార్థం ఆగిపోతుందని పెళ్లి జరగదని ఆయన చెప్పిన వ్యాఖ్యలు నిజం అయ్యాయి. అలాగే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుంటే మూడు సంవత్సరాలకు విడిపోతారని వేణుస్వామి చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో వేణు స్వామి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు.

- Advertisement -