Akhil : అఖిల్ అక్కినేని..సిసింద్రీ సినిమాతో నెలల వయసున్నప్పుడే వెండితెర మీద సందడి చేశాడు. ఆ తర్వాత మనం సినిమాలో క్లైమాక్స్ సీన్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. దర్శకుడు విక్రం కె కుమార్ అక్కినేని ఫ్యామిలీని మనం ఫ్రేంలో చూపించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. మూడు తరాల వారిని ఒకే సినిమాలో చూపించడం అంటే అంత ఈజీ కాదు. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. ఇక నాగేశ్వరరావుతో ఆయన కుటుంబం కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆఖరి సినిమా. అందుకే మనం సినిమాతో పాటు దర్శకుడు ఆ ఫ్యామిలీ జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలుస్తారు.

akhil doesnot know acting....
akhil doesnot know acting….

ఇక ఎండింగ్‌లో అఖిల్ ఎంట్రీ హాలీవుడ్ రేంజ్‌లో చూపించాడు విక్రం కుమార్. దాంతో అఖిల్ ఇండస్ట్రీకి సమయం వచ్చిందని చెప్పుకున్నారు. దాంతో అఖిల్ సినిమాతో అఖిల్ హీరో అయ్యాడు. యూత్‌స్టార్ నితిన్ నిర్మాతగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత అఖిల్ నుంచి మరో రెండు సినిమాలొచ్చాయి. విక్రం కుమార్ దర్శకత్వంలోనే హలో, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ఞు. ఈ రెండు సినిమాలతోనూ అఖిల్‌కి హిట్ దక్కలేదు.

Akhil : అఖిల్ కి మూడు సినిమాలు చేసిన హిట్ దక్కకపోవడానికి కారణం అదేనా..?

అయితే అఖిల్ కి మూడు సినిమాలు చేసిన హిట్ దక్కకపోవడానికి కారణం మంచి కథ దొరకకపోవడమే అని చెప్పుకుంటున్నారు. మొదటి సినిమా నుంచి పర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్..ఫైట్స్ పరంగా బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఏవో కొన్ని సీన్స్‌లో మాత్రం అంతగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపించాయి. అయితే హ్యాండ్సం హీరో..హీరో మెటీరియల్ అనే పేరు మాత్రం బాగానే సంపాదించుకున్నాడు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. వీటితో ఫాంలోకి వస్తాడని నమకంగా ఉన్నాడు అఖిల్.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 15, 2021 at 1:27 సా.