Magadheera : మెగా పవర్ స్టార్ రాం చరణ్ చిరుతతో తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. మొదటి సినిమాతో చరణ్ యావరేజ్ హిట్ అందుకున్నాడు. అయితే మాస్ హీరోగా మెగా వారసుడు అనిపించుకుంటాడని ఇండస్ట్రీ మొత్తం అభిప్రాయపడింది. పూరి చూపించిన విధానం చరణ్ డెబ్యూ సినిమాతో బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది. అయితే రెండవ సినిమా ఏకంగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఇది చరణ్ కెరీర్ ని ఒక్కసారిగా తారా స్థాయిలో నిలబెట్టింది.

Allu arjun movie is flop after seeing magadheera-
Allu arjun movie is flop after seeing magadheera-

మగధీర సినిమా దాదాపు 45 కోట్ల భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించాడు. ఒకదశలో బడ్జెట్ తెలిసి రాజమౌళి షాకయ్యాడు కూడా. రిజల్ట్ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా ముఖం ఎలా చూపించాలి అని కంగారు పడ్డాడు. కానీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ కూడా నా కెరీర్ లో ఇంత పెద్ద హిట్ ఎప్పటికో గానీ దక్కలేదు. కానీ చరణ్ కి రెండవ సినిమాతోనే ఇంత పెద్ద విజయం అందుకోవడం అదృష్టం అని సక్సెస్ మీట్ లో వెల్లడించాడు. ఈ సినిమా సక్సెస్ ఇండస్ట్రీలో అందరినీ కలవరపెట్టింది. ప్రతీ హీరో ఇటువంటి సినిమా చేయాలని పట్టుదలగా ఉన్నాడు.

Magadheera : ఆ ఆలోచనతోనే అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమా చేశాడు.

ఆ ఆలోచనతోనే అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా మగధీరలా చెప్పుకునే సక్సెస్ సాధించలేదు. భారీ విజువల్ వండర్ గా బద్రీనాథ్ తెరకెక్కించారు. అల్లు అర్జున్ మేకోవర్ కి కూడా రోజులో కొన్ని గంటలు కేటాయించాల్సి వచ్చేది. చాలా శ్రమించాడు. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ వద్ద బద్రీనాథ్ ఫలితం ఊహించని విధంగా ఎదురైంది. అల్లు అర్జున్ అనుకున్న సక్సెస్ ఈ సినిమా ఇవ్వలేకపోయింది. పైగా నిర్మాతలకి ఆర్ధికంగానూ నష్టాలను మిగిల్చింది. డైరెక్టర్‌గా వినాయక్ ని తీవ్రంగా నిరాశ పరచింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 24, 2021 at 7:30 సా.