Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శనివారం ఏప్రిల్ 8వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా అల్లు అర్జున్ తన 41 పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా అల్లు అర్జున్ కు సినీ సెలబ్రిటీలతోపాటు, క్రికెటర్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ఎన్టీఆర్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపిన ఎంతో భిన్నంగా ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు చెబుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ బర్త్ డే బావా అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు థాంక్యూ యువర్ లౌల్లీ విషెష్ బావా… వార్మ్ హగ్స్ అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రిప్లైకు వెంటనే ఎన్టీఆర్ అదిరిపోయేలా మరో రిప్లై ఇచ్చాడు. ఓన్లీ హగ్సేనా… పార్టీలేదా పుష్ప అంటూ సరదాగా స్వీట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అల్లు అర్జున్, తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Allu Arjun: ఎంతో మంచి స్నేహితులు…
సాధారణంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు వీరిద్దరూ ఏ సందర్భంలో మాట్లాడుకున్న లేదా ఏదైనా అకేషన్ లో కలిసిన కూడా సరదాగా బావ అంటూ పిలుచుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బావ అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో వీరి అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.