Allu Arjun – Yash: డబ్బుకోసం మా వాళ్ళను మోసం చేయాల్సిన అవసరం లేదు..

G K

Allu Arjun – Yash: ఇటు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటు కన్నడ రాకింగ్ స్టార్ యష్‌లను చూసి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్‌కు ఉన్న స్టార్ ఇమేజ్ స్టైలిష్ స్టార్. పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమా చేసిన తర్వాత ఐకాన్ స్టార్‌గా మారాడు. అల వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్ పార్ట్ 1 చిత్రాలలో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న అల్లు అర్జున్‌కు ఇంటర్నేషనల్ ప్రమోషనల్ యాడ్ ఫిలింలో నటించే అవకాశాలు విరివిగా వస్తున్నాయి.

ఇప్పటికే, అల్లు అర్జున్ చేసిన రెండు యాడ్స్ టీవీలో ప్రసారమవుతున్నాయి. అయితే, వీటివల్ల కొంత కాంట్రవర్సీకి, నెటిజన్స్ వల్ల ట్రోల్స్‌కు గురైయ్యాడు బన్నీ. ఇక ఆ తర్వాత ఓ పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు గానూ అల్లు అర్జున్‌కు భారీ ఆఫర్ ఇచ్చింది సదురు కంపెనీ. కానీ, దాన్ని బన్నీ తిరస్కరించాడు. అలాంటి పాన్ మసాలా యాడ్‌లో తాను గనక నటిస్తే మాస్ ఆడియన్స్, యువత మీద తీవ్రంగా ప్రభావం చూపుతుందని దాని వల్ల యాడ్‌లో అల్లు అర్జున్ చూసి వారు పాన్ మసాలా తినడానికి ఆసక్తి చూపిస్తారని ఇలా చేయడం తన అభిమానులను మోసం చేయడం అని భావించి ఆ యాడ్‌లో నటించేందుకు నో చెప్పాడు.

allu-arjun-yash-rejected high remuniration ads to save fans
allu-arjun-yash-rejected high remuniration ads to save fans

Allu Arjun – Yash: ఇప్పటికే కొన్ని కోట్ల యాడ్ ఫిలింస్ రిజెక్ట్ చేశాడు.

ఇటీవల అలాంటి యాడ్ ఫిల్మ్ ఒకటి కన్నడ రాకింగ్ స్టార్ యష్‌కు వచ్చింది. దాదాపు రూ 10 కోట్ల వరకు ఈ యాడ్ ఫిలిం చేస్తే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సదురు సంస్థ సిద్ధమైంది. కానీ, యష్ దాన్ని సింపుల్‌గా రిజెక్ట్ చేశాడు. కారణం అది ఓ లిక్కర్ బ్రాండ్ అని సమాచారం. ఇలాంటి బ్రాండ్స్ ప్రమోట్ చేసి తన అభిమానులను, యువతను తప్పుదోవ పట్టించడం ఇష్టం లేక యష్ ఈ యాడ్ చేసేందుకు నో చెప్పాడు. దాంతో అటు కన్నడలో ఇటు టాలీవుడ్‌లో ఈ ఇద్దరు హీరోలను చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌కు అసలు యాడ్స్ అంటేనే ఇష్టముండదు. ఇప్పటికే కొన్ని కోట్ల యాడ్ ఫిలింస్ రిజెక్ట్ చేశాడు.

- Advertisement -