Amala paul: తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన కోలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అమలాపాల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. నటి అమలా పాల్ తమిళ్ సిని పరిశ్రమకి చెందిన నటి అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకుంది.
అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా నటి అమలాపాల్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దీనికితోడు ప్రేమ పెళ్లి వంటివి కూడా వికటించడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఈ బ్యూటీ ఆఫర్లు లేక ఖాళీ అయిపోయింది. అయితే తాజాగా నటి అమలాపాల్ కి ఎదురైనటువంటి ఓ చేదు సంఘటన కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే నటి అమలాపాల్ ఇటీవలే కేరళ రాష్ట్రంలోని తిరువైరాణికులం ప్రాంతంలో ఉన్నటువంటి మహదేవ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్ళింది. కానీ నటి అమలాపాల్ అన్యమతస్తురాలు కావడంతో ఆలయ నిర్వహకులు ఆమెను దేవుడు దర్శనానికి అనుమతించలేదు. దీంతో నటి అమలాపాల్ ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అలాగే మనం 2023వ సంవత్సరంలో ఉన్న ఇప్పుడు కూడా మతాలు కులాలు అంటూ చాలామంది బతుకుతున్నారని కానీ ఏదో ఒక రోజు కచ్చితంగా కులాలు మతాలకు అతీతంగా సమాధానం చెప్పే రోజు వస్తుందని ఆలయ రిజిస్టర్లో లెటర్ రాసినట్లు పలు కథనాలు వెలుపడ్డాయి.
దీంతో ఆలయ నిర్వహణ కూడా తరచుగా దేవుడి దర్శనం కోసం ఎంతోమంది ఇతర మతస్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారని ఎప్పుడూ ఎవరికీ కూడా ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేశారు. అలాగే కేవలం సినీ సెలబ్రిటీలు లేదా ఇతర ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయని అంతేకాకుండా కేవలం మేము ఆలయ ప్రోటోకాల్ ని మాత్రమే ఫాలో అవుతున్నామని అందులో ఎలాంటి వ్యక్తిగత నిర్ణయాలు లేవని వివరణ ఇచ్చారు. దీంతో నటి అమలాపాల్ కి ఎదురైన ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో నటి అమలాపాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. కానీ ఈ అమ్మడి ప్రతిభను నిరూపించుకునేందుకు మాత్రం ఇప్పటివరకు సరైన అవకాశం రాకపోవడంతో కొంతమేర ఆఫర్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.