Amalapaul : అమలాపాల్ తెలుగు తమిళ సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తూ ప్రస్తుతం బాగా బిజీగా ఉంది. సినిమాలకంటే కూడా ఈమె వెబ్ సిరీస్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం బాగానే చేస్తుంది. కానీ ఆమెకి దక్కాల్సిన స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ పాత్రల్లో నటించడానికి కూడా అంటే ఒంటి మీద వస్త్రాలు లేకుండా నటించడానికి ధైర్యం చేస్తోంది. ఆ మధ్య వచ్చిన ఆమె సినిమాలో ఆమె పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒకరకంగా చెప్పాలంటే అమలాపాల్‌కి ఆమె తర్వాత ఛాలెంజింగ్ రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి.

amalapaul-received comments for that song
amalapaul-received comments for that song

ఇటీవలే తెలుగు ఓటీటీ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేసింది. కుడి ఎడమైతే అనే టైటిల్‌తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇటీవల రిలీజై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె పోషించిన పోలీస్ పాత్రకి బాగా పేరు తెచ్చింది. అంతేకాదు అమలాపాల్ లోని మరో కోణం బయటకి వచ్చిందని విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈమెకి ఎక్కువగా వెబ్ సిరీస్ లలోనే అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఇద్దరమ్మాయిలు, నాయక్ లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ రెండు సినిమాల తర్వాత మళ్ళీ పెద్దగా తెలుగు సినిమాలలో అమలాపాల్ కి అవకాశాలు రాలేదు.

Amalapaul : ఈ సాంగ్ కి అమలాపాల్ పెద్ద మైనస్ అన్నారు.

ఇక నాయక్ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కి జంటగా నటించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రాధ విజయశాంతి నటించిన కొండవీటి దొంగ లోని శుభలేక రాసుకున్న ఎదలో ఎపుడో అనే ఆటను రీమిక్స్ చేశారు. ఈ పాటలో అమలాపాల్ చరణ్ తో కలిసి స్టెప్పులేసింది. అయితే ఈ పాటలో అమలా డాన్స్ అసలు బాగోలేదని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. రాధ చేసిన డాన్స్ మూవ్ మెంట్స్ ఇప్పటికీ అందరూ గుర్తు పెట్టుకున్నారు. కానీ ఈ పాటలో రాధ ప్లేస్ లో అమలాపాల్ ని ఊహించుకోలేకపోయారు. సాంగ్ విన్నప్పుడు కలిగిన ఉత్సాహం కూడా మాత్రం కలగలేదు. ఈ సాంగ్ కి అమలాపాల్ పెద్ద మైనస్ అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 20, 2021 at 12:00 సా.