Ameesha Patel : అమీషా పటేల్. ఒకప్పుడు ఈ అమ్మడి పేరు వింటే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం, అభినయం, నటనా ప్రతిభతో టాలీవుడ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో అమీషా పటేల్ కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అయితే అమీషా పటేల్ తెలుగులో ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.
ఈ చిత్రం మంచి హిట్ అవడంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అమీషా పటేల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కూడా పర్వాలేదనిపించింది. దీంతో అమీషా పటేల్ కి సినిమా ఆఫర్లు బాగానే వరించినప్పటికీ ఈ అమ్మడికి బాలీవుడ్ పై మనస్సు మళ్ళడంతో తెలుగు సినీ పరిశ్రమని పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్వతహాగా ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమకు చెందినది కావటంతో బాలీవుడ్ కి వెళ్ళిన కొత్తలో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణించింది.
కానీ క్రమక్రమంగా కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఎక్కువగా డిజాస్టర్లను అందుకుంది. దీంతో ఈ ప్రభావం ఈ అమ్మడు సినీ కెరియర్ పై పడింది. దీనికితోడు అమీషా పటేల్ అప్పుడప్పుడు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలు మరియు బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలో నటించడంతో చాలామంది దర్శక నిర్మాతలు ఈ అమ్మడి లో ఉన్నటువంటి బోల్డ్ యాంగిల్స్ మాత్రమే గుర్తించారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఈ బ్యూటీకి నటనకు ప్రాధాన్యత ఉన్న అటువంటి పాత్రలు దక్కించుకోలేకపోయింది. కానీ అమీషా పటేల్ తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్ గెస్ట్ అప్పియరెన్స్, స్పెషల్ అప్పియరెన్స్ పాత్రలలో నటించింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడికి 45 ఏళ్ల వయసు పైబడుతున్నప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం నటి అమీషా పటేల్ మళ్లీ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అందువల్లనే ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో పలురకాల ఫోటో షూట్లు ఆడిషన్స్ అంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు బికినీ షూట్లు, స్కిన్ షో గ్లామర్ షో వంటివి చేస్తూ మతి పోగొడుతోంది. మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలాగో ఆకట్టుకోలేకపోయిన అమీషాపటేల్ కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.