Amma Rajasekhar: టాలీవుడ్ డాన్స్ మాస్టర్ లలో ఒకరైన అమ్మ రాజశేఖర్ మాస్టర్ గురించి మన అందరికి తెలిసిందే. వెండితెరపై హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. కాగా బిగ్ బాస్ హౌస్ తో బుల్లితెరపేక్షకులకు కూడా చేరువయ్యాడు. అయితే డాన్స్ మాస్టర్ గా చేసి ఆ తర్వాత దర్శకుడిగా మారిన వారిలో అమ్మ రాజశేఖర్ కూడా ఒకరు. మొదటి డాన్స్ మాస్టర్ గా చేసిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. కాగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా అలాగే డాన్స్ మాస్టర్ గా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ హీరో గోపీచంద్ తనని మోసం చేశాడు అంటూ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటర్వ్యూలో భాగంగా రాజశేఖర్ మాస్టర్ గతంలో తన జీవితంలో జరిగిన మోసాల గురించి బయట పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోపీచంద్ తనని మోసం చేశాడు అన్నమాట ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే హీరో గోపీచంద్ వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు, తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అటువంటి గోపీచంద్ పై అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఈ విధంగా కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే మోసం ఎలా జరిగింది అన్న వివరణ కూడా ఇచ్చారు.
Amma Rajasekhar: గోపీచంద్ నన్ను మోసం చేశాడు..
గోపీచంద్ నటించిన రణం సినిమా తరువాత మరొక సినిమా చేద్దామని అమ్మ రాజశేఖర్ తో గోపీచంద్ అన్నాడట. ఆ సినిమాకు సంబంధించి డీప్ గా ఒక లైన్ చెప్పడంతో తప్పకుండా చేద్దామని అన్నాడట గోపీచంద్. కానీ అమ్మ రాజశేఖర్ కు ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ నుంచి సినిమా చేసే అవకాశం వచ్చిందట. అయితే అందుకు హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు కూడా ఒప్పుకోవడంతో షూటింగ్ కోసం స్పెషల్ సెట్ వేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అని చెప్పుకొచ్చాడు అమ్మ రాజశేఖర్. ఇక వెంకటేష్ తో సినిమా మొదలుపెట్టాలి అనుకుంటున్న సమయంలో గోపీచంద్ సత్యరాజ్ కాంబినేషన్లో శంఖం సినిమా వచ్చిందట. ఆ సినిమా చూసిన తర్వాత అమ్మ రాజశేఖర్ కు అది అతను గోపీచంద్ కు వినిపించిన కథల అనిపించిందట. అప్పుడు నిర్మాత సురేష్ బాబు కూడా ఆ కథ వద్దని మరొక సినిమా చేద్దామని అనడంతో మళ్లీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదట. ఆ సమయంలో చాలా ఏడ్చేశాను బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు అమ్మ రాజశేఖర్.