Anasuya: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గడిచిన రెండు మూడు నెలల్లో జబర్దస్త్ ను విడిచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. మొదటి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత నాగబాబుతో పాటు పలువురు కమెడియన్లు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇటీవల జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్,గెటప్ శీను, హైపర్ ఆది కూడా వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం జబర్దస్త్ జడ్జ్ అనసూయ కూడా జబర్దస్త్ షోకీ గుడ్ బాయ్ చెప్పేసింది.
అయితే అనసూయ జూన్ నెలలోనే జబర్దస్త్ లో విడిపోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. నా కెరిర్ లోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నాను. దానిని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే జూన్ నెలలో వెళ్ళిపోతాను అన్నట్టుగా పోస్ట్ పెట్టిన కూడా జులై వరకు కంటిన్యూ అయింది. తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ జబర్దస్త్ కి వీడ్కోలు పడింది. సందర్భంగా స్టేజిపై ఆమె మాట్లాడుతూ.. జబర్దస్త్ షో కి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. కానీ ఈ జబర్దస్త్ షో మాత్రం పర్మినెంట్ అనే సందేశాన్ని ఇచ్చే విధంగా ప్రోమో వదిలారు. అంతేకాకుండా అనసూయ కోసం ఒక స్పెషల్ స్కిట్ కూడా చేశారు.
Anasuya: జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసిన అనసూయ..
ఈ క్రమంలోనే తాగుబోతు రమేష్ అనసూయ మాదిరిగా లేడీ గెటప్ లో వచ్చి నేను నిజంగానే జబర్దస్త్ మానేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసాడు. అప్పుడు వెంటనే వెంకీ మీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళని అమ్మగారికి ఇచ్చి జబర్దస్త్ కోసం పనిచేశారు అలాంటిది ఇప్పుడు జబర్దస్త్ ని వదిలేయడం ఏంటి మేడం అంటూ ఎమోషనల్ గా డైలాగు వేశాడు. ఈ డైలాగ్ కి అనసూయ పెద్దగా ఎమోషన్ కాకపోయినా జడ్జ్ ఇంద్రజ మాత్రం ఎమోషనల్ అయింది. జబర్దస్త్ అనేది పర్మినెంట్ సార్.. ఇక్కడికి వస్తుంటారు వెళ్తుంటారు.. కానీ జబర్దస్త్ స్టిల్ రన్నింగ్ అంటూ తాగుబోతు రమేష్ ఎమోషనల్ డైలాగ్ వేశాడు. అప్పుడు చలాకి చంటి నెలలో మూడు రోజులు మా కోసం కేటాయించలేవా? అని అడగగా కష్టం అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టింది అనసూయ. అయితే రోజా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినప్పుడు తాను ఏడవడంతో పాటు అందరినీ ఏడిపించేసింది. కానీ అనసూయ మాత్రం ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చకుండా జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.