Anitha Chowdary స్లిమ్ గా కనిపించేందుకు బాగానే కష్ట పడుతున్న ఒకప్పటి యాంకర్….

Joythi R

Anitha Chowdary అనితా చౌదరి. ఈ పేరు వింటే టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి ఒకప్పటి ప్రముఖ యాంకర్ అనితా చౌదరి గుర్తొస్తుంది. అలాగే అంతకంటే ముఖ్యంగా మొదటగా తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన చత్రపతి చిత్రంలో సూరీడు తల్లి పాత్రల్లో నటించి తన ఎమోషనల్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సన్నివేశాలు గుర్తొస్తాయి. కాగా నటి అనితా చౌదరి మొదటగా బుల్లితెరపై పలు ధారావాహికలలో నటించి తన కెరీర్ ని ప్రారంభించినప్పటికీ క్రమక్రమంగా సినిమా అవకాశాలు పెరగడంతో సీరియళ్లలో నటించడం మానేసింది.

అయితే ఈ మధ్యకాలంలో నటి అనితా చౌదరి కి కుటుంబ బాధ్యతలు ఎక్కువవడంతో కొంతమేర సినిమా ఇండస్ట్రీ పై తక్కువగా దృష్టి సారిస్తోంది. కాగా నటి అనితా చౌదరి అప్పుడప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులకు మాత్రం అందుబాటులో ఉంటుంది. అయితే తాజాగా నటి అనితా చౌదరి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వర్కౌట్లు చేస్తూ తీసినటువంటి వీడియో ని తన అభిమానులతో పంచుకుంది.

Anitha Chowdary స్లిమ్ గా కనిపించేందుకు బాగానే కష్ట పడుతున్న ఒకప్పటి యాంకర్....
Anitha Chowdary స్లిమ్ గా కనిపించేందుకు బాగానే కష్ట పడుతున్న ఒకప్పటి యాంకర్….

అలాగే మనం హెల్తీ గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించింది. అయితే ఎన్ని రోజులు తన కుటుంబ బాధ్యతలతో బిజీబిజీగా గడిపిన నటి అనితా చౌదరి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మళ్లీ అవకాశాలు దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందువల్లనే నటి అనితా చౌదరి ఫిట్గా ఉండేందుకు బాగానే కసరత్తులు చేస్తోందని కొందరు అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి అనితా చౌదరి టాలీవుడ్ లో ఎక్కువగా ఎమోషనల్ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొంతకాలం పాటు బిజీబిజీగా గడిపింది. ఇందులో నటనారంగంలో ప్రధానం చేసేటటువంటి పనులు అవార్డులు రివార్డులు కూడా అందుకుంది. కాగా నటి అనితా చౌదరి ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉంటున్నట్లు సమాచారం.

- Advertisement -