Annapoornamma: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.అయితే కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇలాంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరంగంలోనూ ఉంటాయి. అయితే ఎక్కడా కూడా ఎవరు ఈ ఇబ్బందుల గురించి బయటకు చెప్పుకోరు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఈ ఇబ్బందుల గురించి ఎంతోమంది నటీమణులు బయటకు ప్రస్తావించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో ఉంది అనే మాటలు చాలా వేస్ట్. ఇలాంటి వేస్ట్ మాటలు మాట్లాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం సినిమా రంగంలోనే కాదు మనం ఏ ఆఫీసుకు వెళ్లిన మహిళలకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునేలా మహిళలు ఉండాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని ఈమె పేర్కొన్నారు.
తప్పు ఎప్పుడూ ఒక వైపు నుంచి జరగదు..
ఒక మహిళ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంది అంటే ఆ తప్పు కేవలం మగవారిది మాత్రమే కాదు రెండు వైపులా నుంచి కూడా తప్పు ఉందని అర్థం. మనం మన ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మనకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవు. మనం బయటికి వెళ్లి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం ఒక వ్యక్తి దగ్గర నిలబడినప్పుడే ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయని, అయితే వాటిని పరిష్కరించుకొనే సత్తా మనలో ఉంటే ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నపూర్ణమ్మ తెలిపారు. ఒక రంగంలో ఉన్న తర్వాత ఒక మగవాడు రూపాయి ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాడు అలాగే ఓ మహిళ రూపాయి సంపాదించాలని ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి కానీ వాటిని ధైర్యంగా తిప్పికొట్టి ముందుకు పోవాలి గాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ ఈమె క్యాస్టింగ్ కౌచ్ గురించి వెల్లడించారు.