Anushka: వెండితెర జేజమ్మగా దేవసేనగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనుష్క చాలా రోజుల తర్వాత మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈమె నటుడు నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇదివరకు కేవలం నవీన్ మాత్రమే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాను ప్రమోట్ చేశారు. అయితే తాజాగా అనుష్క కూడా రంగంలోకి దిగారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనుష్క ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ ఈ సినిమాలో తాను అన్విత అనే ఒక చెఫ్ పాత్రలో నటించబోతున్నానని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని ఈమె తెలియజేశారు. ఇకపోతే తాను ఇదివరకు నటించిన పలు సినిమాలలో నా పాత్ర ఎంతో విభిన్నంగా ఉంటుంది అలాగే తాను నటించే ప్రతి పాత్ర కూడా ఎప్పుడు ప్రేక్షకులకు గుర్తుంది పోవాలని తాను నటిస్తానని తెలిపారు.
తప్పకుండా పెళ్లి చేసుకుంటాను…
ఈ విధంగా తన పాత్రకు న్యాయం చేయడానికి తాను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ అనుష్క చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క పెళ్లి గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి గత కొంతకాలంగా అనుష్క పెళ్ళి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై స్పందించినటువంటి అనుష్క తాను వివాహ వ్యవస్థకు ఎప్పుడు వ్యతిరేకం కాదని తెలిపారు . తాను కూడా పెళ్లి చేసుకుంటానని అయితే సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని తానే స్వయంగా అందరితో పంచుకుంటాను అంటూ పెళ్లి గురించి అనుష్క చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.